Begin typing your search above and press return to search.

ర‌జ‌నీకి ఊహించ‌ని రీతిలో షాకిచ్చిన క‌ర్ణాట‌క‌

By:  Tupaki Desk   |   30 May 2018 3:43 AM GMT
ర‌జ‌నీకి ఊహించ‌ని రీతిలో షాకిచ్చిన క‌ర్ణాట‌క‌
X
వ్యాపారాలు చేసే వారు రాజ‌కీయాల్లోకి రావాల‌నుకుంటే.. అందుకు త‌గిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఆ విష‌యం త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌కు సైతం త‌ప్ప‌ద‌ని మ‌రోసారి రుజువైంది. రాజ‌కీయ పార్టీని ఏర్పాటు చేసి.. రానున్న రోజుల్లో త‌మిళ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని భావిస్తున్న ర‌జ‌నీకి ఇప్పుడు ఊహించ‌ని రీతిలో షాక్ త‌గిలింది.

ఇంకా పూర్తిస్థాయి రాజ‌కీయ నాయకుడిగా మార‌ని రజ‌నీకి సంబంధించి రెండు సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. అందులో ఒక‌టి రోబో 2.0 అయితే.. మ‌రొక‌టి కాలా. అప్పుడెప్పుడో షూటింగ్ పూర్తి అయిన‌ప్ప‌టికీ విజువ‌ల్ ఎఫెక్ట్స్ మీద పెండింగ్ ప‌ని పుణ్య‌మా అని రోబో 2.0 విడుద‌ల ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదా ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే.

యుద్ధ ప్రాతిప‌దిక‌న షూటింగ్ స్టార్ట్ చేసి.. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే విడుద‌ల చేస్తున్న కాలా మీద సినీ ప‌రిశ్ర‌మ‌లో చాలానే అంచ‌నాలు ఉన్నాయి. ఈ చిత్రం జూన్ 7న విడుద‌ల‌కు డేట్ ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ అంద‌రిని ఆక‌ట్టుకోవ‌ట‌మే కాదు.. సినిమా మీద అంచ‌నాల్ని మ‌రింత పెంచింది.

ఇలాంటివేళ‌.. ర‌జ‌నీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఆయ‌న న‌టించిన కాలా చిత్రాన్ని క‌ర్ణాట‌క‌లో ప్ర‌ద‌ర్శించ‌కూడ‌ద‌న్న నిర్ణ‌యాన్ని క‌ర్ణాట‌క ఫిలిం చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ నిర్ణ‌యించింది. రాజ‌కీయ నాయ‌కుడిగా మారిన నేప‌థ్యంలో.. కావేరీ ఇష్యూ మీద ర‌జ‌నీ నిర్ణ‌యాన్ని నిర‌సిస్తూ.. ఆయ‌న మూవీని క‌ర్ణాట‌క‌లో విడుద‌ల చేయకూడ‌న్న నిర్ణ‌యాన్ని తీసుకున్నారు.

కావేరీ న‌దీ జ‌లాల విష‌యంలో క‌ర్ణాట‌క ప్ర‌యోజ‌నాల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ర‌జ‌నీ తీరుపైన అసంతృప్తి వ్య‌క్తం చేసిన ఛాంబ‌ర్.. కాలా మూవీని క‌ర్ణాట‌క‌లో విడుద‌ల చేయ‌కూడ‌న్న నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. ఈ నేప‌థ్యంలో కాలా చిత్రంపై క‌ర్ణాట‌క‌లో నిషేధం విధించిన‌ట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించి ఇప్ప‌టికే సినిమా డిస్ట్రిబ్యూట‌ర్లు.. నిర్మాత‌ల‌తో చ‌ర్చించిన‌ట్లుగా క‌ర్ణాట‌క ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అధ్య‌క్షుడు గోవింద్ వెల్ల‌డించారు. రాజ‌కీయ ఎంట్రీతో ఎన్ని స‌మ‌స్య‌ల‌న్న విష‌యంపై ర‌జ‌నీకి తాజా ఎపిసోడ్‌తో మ‌రింత క్లారిటీ రావ‌టం ఖాయ‌మంటున్నారు.