Begin typing your search above and press return to search.
కాలాని అడ్డుకుంటున్నారా?
By: Tupaki Desk | 4 Jun 2018 5:52 AM GMTసౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది అంటే చాలు ఆ సినిమాకు అందే క్రేజ్ ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రమోషన్స్ అవసరం లేని హీరోల్లో రజినీకాంత్ ముందుంటారనే చెప్పాలి. అయితే ఈ సారి మాత్రం సూపర్ స్టార్ సినిమాకు పెద్దగా బజ్ క్రియేట్ అవ్వడం లేదు. అందులోనూ సినిమాకు ఉహించని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రిలీజ్ చేయడమే కష్టంగా ఉంది.
రైట్స్ అందుకున్న డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఇప్పుడు తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. గత కొన్నేళ్లుగా సాగుతున్న కావేరి నది జలాల విషయంలో ఇటీవల రజినీకాంత్ ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల కర్ణాటక లో రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. జూన్ 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్స్ దర్శనం ఇస్తున్నాయి కానీ అది వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. నార్వే - స్విజర్లాండ్ దేశాల్లో కూడా కాలా రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఆ దేశాల్లో తమిళ్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది.
రజినీకాంత్ సినిమాలకైతే ఇంకా ఎక్కువ ఆదరణ ఉంటుంది. అయితే కొన్ని రోజుల క్రితం టుటికోరిన్ స్టెర్లైట్ నిరసనకారుల విషయంలో రజినీకాంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని నార్వే సభ్యులు కొంత మంది సినిమా విడుదల కాకుండా చూస్తున్నట్లు టాక్. అలాగే స్విజర్లాండ్ లో కూడా మరికొందరు చీకట్లో కాలా ను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. రాజకీయాల్లోకి వెళుతున్న సమయంలో సూపర్ స్టార్ సినిమాలకు ఈ విధంగా ఇబ్బంది రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మరింది. మరి నిర్మాత ధనుష్ ఏ విధంగా ముందుకు వెళతాడో చూడాలి.