Begin typing your search above and press return to search.

మరాఠీ అంటున్నారు.. కాలా ఎక్కుతుందా?

By:  Tupaki Desk   |   7 April 2018 5:45 AM GMT
మరాఠీ అంటున్నారు.. కాలా ఎక్కుతుందా?
X

కోలీవుడ్ హీరో రజినీకాంత్ సినిమా వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా ఆయన అభిమానులలో సంబరాలు మొదలైనట్లే. సినిమా రిజల్ట్ అనేది తరువాత సంగతి. ముందు తెరపై తలైవా కనిపించడా లేదా అనేది ముఖ్యం. పేపర్లు విసిరి విజిల్స్ వేయాల్సిందే. ఇకపోతే ప్రస్తుతం అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం కాలా. పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే అన్ని పనులను పూర్తి చేసుకుంది.

అయితే కాలా సినిమా కథలో మరాఠీ ప్రభావం చాలా కనిపిస్తుందని చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తోంది. అక్కడి వాతావరణం చుట్టే ఈ కథ తిరుగుతుందట. ముంబై లోని ధరవి స్లమ్ లో రజినీకాంత్ కాలా క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. ఇక నానా పాటేకర్ తో గొడవల కారణం చుట్టూ స్క్రీన్ ప్లే నడుస్తోందని అంటున్నారు. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన అంజలి పాటిల్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా గురించి కొన్ని విషయాలను తెలిపింది.

"ఈ చిత్రం కథ మరాఠీ ప్రభావాన్ని చూపుతుంది. నానా పటేకర్ కు సంబంధించి కొన్ని మరాఠీ డైలాగులు ఉంటాయి. ఇక నా పాత్ర తమిళ్ మాట్లాడే మరాఠీ స్త్రీకి చెందినది. ఈ చిత్రానికి ప్రధానమైన బలం ఎవరంటే.. రజినీకాంత్ అని చెప్పాలి. ఆయన వ్యక్తిగత గుణం చాలా మంచిది. నాతో అలాగే ఖురేషి తో చాలా ఫ్రెండ్లి గా ఉన్నారు. మిగతా నటీనటులను ఎంతో గౌరవిస్తారని చెప్పింది. అయితే అంతా బాగానే ఉంది గాని రజినీకాంత్ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. మరి మన వాళ్లకు మరాఠీ టచ్ ఎక్కుతుందా అనేది కాస్త సందేహంగానే ఉంది. మరి రజినీకాంత్ ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.