Begin typing your search above and press return to search.

‘కాలా’ హ‌క్కుల‌కు అన్ని కోట్లు?

By:  Tupaki Desk   |   12 May 2018 10:31 AM GMT
‘కాలా’ హ‌క్కుల‌కు అన్ని కోట్లు?
X
సౌతిండియా సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ న‌టించిన సినిమాల‌కి త‌మిళంలోనే కాకుండా టాలీవుడ్లో కూడా ఫుల్లు డిమాండ్ ఉంటుంది. రేటు ఎంతైనా స‌రే ఆలోచించ‌కుండా కొన‌డానికి బ‌య్య‌ర్లు ముందుంటారు. ఎందుకంటే ర‌జినీ క్రేజ్ దృష్ట్యా చూసుకున్నా సినిమాకి పాజిటివ్ టాక్ వ‌స్తే వ‌సూళ్ల వ‌ర్షం కుర‌వ‌డం గ్యారెంటీ. అయితే ఆయ‌న‌ తాజా చిత్రం ‘కాలా’కి ప‌రిస్థితి భిన్నంగా ఉంది. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతున్నా ఇంకా రైట్స్ అమ్ముడు కాలేదు.

ర‌జినీ న‌టించిన ‘రోబో’ స్వీకెల్ చిత్రం ‘రోబో 2.0’ చిత్ర హ‌క్కులు ఇక్క‌డ 80 కోట్ల రూపాయ‌ల‌కు అమ్ముడ‌య్యాయి. ఓ డ‌బ్బింగ్ సినిమాకి ఇంత భారీ బిజినెస్ జ‌రిగిందంటే అది ర‌జినీ మ‌హ‌త్య‌మే. అయితే కాలా ప‌రిస్థితి మాత్రం వేరుగా ఉంది. రోబో రేటు చూసిన కాలా నిర్మాత‌లు తెలుగు హ‌క్కుల రేటును 40 కోట్లుగా నిర్ణ‌యించారు. అయితే ఆ రేటు పెట్టి కొనేందుకు బ‌య్య‌ర్లు ముందుకు రావ‌డం లేదు. సూప‌ర్ స్టార్ న‌టించిన చివ‌రి నాలుగు సినిమాలు కోలీవుడ్ బ‌య్య‌ర్ల‌తో పాటు తెలుగు బ‌య్య‌ర్ల‌ను ముంచేశాయి. అందులో రంజిత్ తీసిన ‘క‌బాలి’ కూడా ఉంది. అందుకే క‌రికాలుడి కోసం 40 కోట్లు కాదు క‌దా 20 కోట్లు పెట్ట‌డం కూడా చాలా పెద్ద రిస్క్ చేసిన‌ట్టే! అని చెప్పుకోవాలి. ద‌ర్శ‌కుడు శంక‌ర్ మ్యాజిక్ వ‌ల్ల‌... గ్రాఫిక్స్ వ‌ల్ల రోబోకి క‌లెక్ష‌న్లు రావ‌చ్చు గానీ ‘కాలా’ టాక్ గాని తేడా కొడితే బ‌య్య‌ర్ల ప‌ని గోవిందే!

అయితే చిత్ర నిర్మాత‌లు మాత్రం రూ.40 కోట్ల‌కి త‌గ్గ‌డం లేద‌ట‌. అయితే ర‌జినీ సినిమాకి ఆ రేటు చెల్లించేందుకు కొంద‌రు టాలీవుడ్ నిర్మాత‌లు ఆస‌క్తి చూపించారని... అడిగినంత చెల్లించి హ‌క్కులు కొన్నార‌ని అంటున్నారు. అయితే ఆ హ‌క్కులు కొన్న‌ది ఎవ‌ర‌నేది మాత్రం ఇంకా తెలియ‌రాలేదు.