Begin typing your search above and press return to search.
డైనోసార్లకు దారి వదిలేస్తాడా?
By: Tupaki Desk | 30 May 2018 4:24 AM GMTసూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఆయన కొత్త సినిమా కోసం ఎంతో ఆరాటంగా ఎదురుచూస్తున్నారు. అప్పుడెప్పుడో శంకర్ డైరెక్షన్ లో మొదలెట్టిన 2.0 ఇంకా కొలిక్కి రాలేదు. తరవాత మొదలెట్టిన కాలా పూర్తి కావడంతో చివరకు ఈ సమ్మర్ కు ఆ మూవీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అది కాస్తా వాయిదా పడుతూ పడుతూ చివరకు జూన్ 7న రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు.
కనీసం సెలవులు పూర్తయ్యే ముందయినా సూపర్ స్టార్ సినిమా వస్తోందని అనుకున్నా అది కూడా డౌట్ లో పడేలా ఉంది. ఎందుకంటే కాలా సినిమా సెన్సార్ ఇంకా పూర్తి కాలేదు. ఈ మూవీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలను ఎత్తి చూపేలా కొన్ని సీన్లు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో సెన్సార్ మెంబర్లు ఇంకా రిలీజ్ కు ఓకే చెప్పలేదు. ‘‘అసలే తమిళనాడులో రాజకీయ వాతావరణం సరిగా లేదు. ఈ టైంలో ఈ సినిమా రిలీజ్ ద్వారా కొత్త చిక్కులు వచ్చే ప్రమాదం లేకపోలేదు. అందుకే ఈ సినిమాను చాలా జాగ్రత్తగా చూశాకే ఓకే చెప్పే ఉద్దేశంలో ఉన్నామంటూ’’ సెన్సార్ నుంచి రిప్లయ్ వచ్చిందని కాలా యూనిట్ సభ్యుడొకరు తెలిపారు.
సెన్సార్ అడ్డంకులతో కాలా పోస్ట్ పోన్ అయితే దానికి ఇంకో గండం తప్పినట్టే. హాలీవుడ్ మూవీ జురాసిక్ వరల్డ్ : ఫాలెన్ కింగ్ డం కూడా జూన్ 7నే రానుంది. స్టీవెన్ స్పీల్ బర్గ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ఇప్పట్లో మన ప్రేక్షకుల్లోనూ మంచి ఆసక్తి ఉంది. ఇప్పటికే అవెంజర్స్ - జంగిల్ బుక్ లాంటి హాలీవుడ్ సినిమాలు భారతీయ సినిమాలను దెబ్బకొట్టి మరీ కలెక్షన్లు కొల్లగొట్టాయి. ఇప్పుడు కాలా ఏ మాత్రం తేడా కొట్టినా జురాసిక్ వరల్డ్ దెబ్బకు కలెక్షన్లు విపరీతంగా పడిపోతాయి. కాలా డైనోసార్లకు దారి వదిలేస్తాడో.. లేక యుద్ధానికి సిద్ధమంటాడో చూడాలి.