Begin typing your search above and press return to search.
2.0 కంటే ముందే కాలా రెడీ అయ్యాడు
By: Tupaki Desk | 22 Jan 2018 8:31 AM GMTసూపర్ స్టార్ రజనికాంత్ దశాబ్దాల తర్వాత ఒకే సంవత్సరం రెండు సినిమాలతో రాబోతున్నాడు. 2.0 రిలీజ్ డేట్ విషయంలో ఇప్పటికీ కన్ఫ్యూజన్ కొనసాగుతూ ఉండగా మరో పక్క రంజిత్ పా దర్శకత్వంలో రూపొందిన కాలా ఫస్ట్ కాపీ తుది మెరుగులు దిద్దుకుంటోంది. మార్చ్ రెండో వారానికి విడుదలకు సిద్ధంగా ఉండే సెన్సార్ కాపీ చేతిలో పెట్టేస్తానని రంజిత్ పా నిర్మాత ధనుష్ కు చెప్పేశాడట. దీంతో 2.0 కంటే ఇదే ముందు విడుదల అవుతుందేమో అన్న టాక్ కూడా మొదలైంది. అలా జరగడానికి అవకాశాలు తక్కువే. తన రాజకీయ పార్టీని ప్రకటిస్తున్న టైంలోనే 2.0 ఏప్రిల్ లో వచ్చి తీరుతుందని 13 డేట్ తో సహా రజని ప్రకటించాడు. కాని లైకా సంస్థ నుంచి ఆడియో, ట్రైలర్, ఫస్ట్ లుక్ కి సంబంధించి ఎటువంటి అప్ డేట్స్ లేవు. ఏప్రిల్ చివరి వారం షిఫ్ట్ చేసే అవకాశం గురించి ఇప్పటికీ చాలా ఊహాగానాలు ఉన్నాయి.
దాని బదులు కాలానే విడుదల చేస్తే పోలా అని ఫాన్స్ అంటున్నా నిర్మాత ధనుష్ మాత్రం దీన్ని దీపావళి కానుకగా ఇవ్వాలనే నిర్ణయంలో ఉన్నాడని తెలిసింది. ఒకవేళ 2.0 విడుదల పూర్తి సందిగ్ధంలో పడిపోయి ఇంకా ఆలస్యం అవుతుంది అనుకునప్పుడు కాలా బయటికి రావడం గురించి నిర్ణయం తీసుకోవచ్చని తెలిసింది. కాలా మాఫియా నేపధ్యంలో సాగే కథ. కోల్కతా, ముంబైలో నేర సామ్రాజ్యాన్ని స్థాపించిన ఒక డాన్ కథగా రంజిత్ పా దీన్ని తీర్చిదిద్దినట్టు కోలీవుడ్ టాక్. బాషా తర్వాత ఆ స్థాయిలో యాక్షన్ ఎంటర్ టైన్మెంట్ ఇందులో ఉంటుందని రంజిత్ పా పదే పదే చెబుతున్నాడు.
ఒక పక్క పొలిటికల్ పార్టీ కార్యకలాపాలు, మరో పక్క రెండు సినిమాలకు సంబంధించిన ప్రమోషన్లు మొత్తానికి రజనితో పాటు అతని ఫాన్స్ కి కూడా ఈ ఏడాది బిజీ బిజీగా మారనుంది. కబాలి దెబ్బకి అనవసర ప్రయోగాలు చేయకుండా మాస్ ఫార్ములాతో రజనిని ఎలా చూడాలనుకుంటారో అలా చూపించానని చెబుతున్న రంజిత్ పా మాటలు కాలా విషయంలో ఎంత్ వరకు నిజమో విడుదల అయ్యాకే తెలిసేది.