Begin typing your search above and press return to search.
కబాలి ఎంత కాలుస్తాడు అంటారు?!
By: Tupaki Desk | 27 July 2016 3:55 AM GMTఇప్పటికే కబాలి 400 కోట్లు వసూలు చేస్తే ఇంకా నష్టం ఏంటి అనుకుంటున్నారా? అబ్బే అక్కడే ఉంది ట్విస్టు మరి. సినిమాను తీసిన నిర్మాత ఎలాగైనా సేఫ్ జోన్ లోనే ఉంటాడు. కాని కొనుక్కున్న పంపిణీదారులు ఉన్నారే.. వారు మాత్రం అంత తేలికగా సేఫ్ కాలేరు. కొన్ని ఏరియాల్లో లక్కు కలిసొచ్చి కొందరికి జేబులు సమంగా నిండొచ్చేమో కాని.. మిగిలిన ఏరియాల్లో మాత్రం చేతులు కాలేలా ఉన్నాయ్.
ఫర్ సపోజు తెలుగు పంపిణీదారులనే తీసుకుంటే.. 30 కోట్లకు కబాలి ఆంధ్ర అండ్ తెలంగాణ రైట్స్ కొనుక్కున్నారు ఓ ఇద్దరు కొత్త బాబులు. సినిమాను నైజాంలో అభిషేక్ పిక్చర్స్ కు అమ్మేశారు కాని.. ఆంధ్ర అండ్ సీడెడ్ లో మాత్రం వారే స్వయంగా రిలీజ్ చేసుకున్నారట. తొలి వీకెండ్ 18+ కోట్ల షేర్ కలెక్టు చేసిన కబాలి.. సోమవారం నాడు ఘోరంగా దెబ్బతినేసింది. 1.5+ కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. ఎలా చూసుకున్నా కూడా.. మహా అయితే.. ఒక 22 కోట్ల షేర్ వసూలు చేస్తుందేమో అంటున్నారు ట్రేడ్ నిపుణులు. ఆ లెక్కన చూసుకుంటే సినిమా పబ్లిసిటీ ఖర్చులు తొలగిస్తే.. పంపిణీదారులకు వచ్చేది కేవలం 21 కోట్లు మాత్రమే. దాదాపు ఒక 10 కోట్ల వరకు చేతులు కాలిపోయే ఛాన్సుంది.
ఒకవేళ లక్ అనేది సూపర్ స్టార్ రజనీకాంత్ సైడ్ ఉంటే మాత్రం.. తదుపరి వారాల్లో వచ్చే ఇతర సినిమాలన్నీయావరేజుగా తేలిపోతే.. ఆ ఊపులో కబాలి కూడా అలాగే నిలబడిపోతే.. కేవలం 5 కోట్ల లాసుతో గట్టెక్కేయొచ్చు. ఎలాంటి మిరాకిల్స్ జరిగినా కూడా లాసు మాత్రం పక్కా అనిపిస్తోంది.