Begin typing your search above and press return to search.
జులై 1న కబాలి రాడు.. ప్రూఫ్ ఇదిగో
By: Tupaki Desk | 14 Jun 2016 6:14 AM GMTసూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వస్తోందంటే అటు తమిళంలో కానీ.. ఇటు తెలుగులో కానీ.. పోటీగా ఇంకో సినిమా రిలీజ్ చేయడానికి ఎవ్వరూ సాహసం చేయరు. ‘కబాలి’ కోసం బుక్ చేసిన జులై 1న మరే సినిమా రిలీజ్ కాదనే అనుకుంటున్నారంతా. కానీ ఆ రోజు తమిళంలో ఒకటికి రెండు సినిమాలు రిలీజవుతున్నాయి. సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్న ‘జాక్సన్ దురై’తో పాటు ‘జోకర్’ అనే సినిమా కూడా జులై 1నే విడుదలవుతున్నాయి.
రజినీ సినిమాకు పోటీగా వీటిని రిలీజ్ చేసేంత సాహసం చేయరు కాబట్టి.. ఆ రోజు ‘కబాలి’ రాదన్న విషయంలో కన్ఫమ్ చేసేసుకోవచ్చు. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే.. ‘కబాలి’ జులై 1 నుంచి 15కు వాయిదా పడటం ఖాయం. ఐతే కనీసం 15న అయినా ఈ సినిమా వస్తే అదే సంతోషం అంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. ‘జాక్సన్ దురై’ సినిమా తెలుగులో ‘దొర’ పేరుతోనూ జులై 1నే విడుదలవుతుండటం విశేషం.
ముందుగా అనుకున్న ప్రకారమైతే ‘కబాలి’ మే నెలలోనే రావాల్సింది. తర్వాత జూన్ తొలి వారం అన్నారు. చివరికి స్వయంగా నిర్మాతే జులై 1న సినిమా రిలీజ్ అని ప్రకటించడం.. ప్రమోషన్ కూడా ఆ రకంగానే చేయడంతో ఆ డేటు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు అభిమానులు. కానీ వాళ్ల ఆశలపై నీళ్లు చల్లుతూ ‘కబాలి’ని ఇంకోసారి వాయిదా వేసేశారు. ‘కబాలి’ ఆలస్యమవుతుండటానికి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో జాప్యమే కారణం. సినిమా మీద అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో దర్శకుడు పా రంజిత్ మరింత జాగ్రత్త పడుతున్నాడట. పైగా తమిళం-తెలుగు-హిందీలతో పాటు విదేశీ భాషల్లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల్సి ఉండటంతో పనులు ఆలస్యవుతున్నాయి.