Begin typing your search above and press return to search.
రజనీకాంత్ హెల్త్ బులిటెన్ విడుదల
By: Tupaki Desk | 25 Dec 2020 2:33 PM GMTసూపర్ స్టార్ రజినీకాంత్ సడెన్ గా అస్వస్థతకు గురైన విషయం అందరిలోనూ ఆందోళనకు కారణమైంది. హైదరాబాద్ లో తన సినిమా షూటింగ్ కు వచ్చిన సందర్భంగా ఆయన సినిమా యూనిట్ లోని ఎనిమిది మంది కరోనా బారిన పడ్డారు. దీంతో వెంటనే చిత్రం షూటింగ్ బంద్ అయిపోయింది. ఈ క్రమంలోనే రజినీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. రజినీకాంత్ కు పరీక్షలు చేయగా కరోనా సోకలేదని తేలింది. హైబీపీ కారణంగానే రజినీకాంత్ ఆరోగ్యం దెబ్బతిందని తేలింది.
హైబీపీ కారణంగా హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్ హెల్త్ బులిటెన్ ను వైద్యులు విడుదల చేశారు. ఆయనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని హైబీపీ మాత్రమే ఉందన్నారు. రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తుందని బీపీలో హెచ్చు తగ్గుదలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని వైద్యులు తెలిపారు. బీపీ అదుపులోకి రాగానే డిశ్చార్జి చేస్తామన్నారు.
గత 10 రోజులుగా ‘అన్నాత్తే’ షూటింగ్ కోసం రజనీ హైదరాబాద్ లో ఉంటున్నారు. రెండు రోజుల కిందట చిత్రం యూనిట్ లో 8 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో రజనీ టెస్టు చేయించుకోగా నెగెటివ్ రిపోర్టు వచ్చింది. రజినీకాంత్ వెంట కుమార్తె ఐశ్వర్య కూడా ఉన్నారు. కాగా రజనీ ఆరోగ్యంపై వార్తలు రావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
కాగా రజినీకాంత్ ఆరోగ్యం దెబ్బతినడంపై పలువురు స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరారు. సూపర్‌స్టార్ రజినీకాంత్ అస్వస్థతపై ట్విట్టర్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. రజినీకాంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాని చెప్పారు. శుక్రవారం ఉదయం రజినీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఇక పవన్ కళ్యాణ్ కూడా రజినీకాంత్ కోలుకోవాలని ట్విట్టర్ లో కోరుకున్నారు. ఆయన త్వరగా ఆయురారోగ్యాతో బయటకు రావాలని ఆకాంక్షించారు.