Begin typing your search above and press return to search.

రజినీతో పోలికా?? టూమచ్

By:  Tupaki Desk   |   30 March 2016 5:30 PM GMT
రజినీతో పోలికా?? టూమచ్
X
రాఘవ లారెన్స్ ప్రస్తుతం మంచి బూమ్ లోనే ఉన్నాడు. అటు డైరెక్టర్ గాను, ఇటు యాక్టర్ గాను వరుసగా హిట్లు కొడుతుండడంతో.. కొరియోగ్రాఫర్ నుంచి డైరెక్టర్ కం హీరోగా మారిపోయిన లారెన్స్.. కోలీవుడ్ లో బాగానే వెలుగుతున్నాడు. ప్రస్తుతం లారెన్స్ ఓ టాలీవుడ్ మూవీని తమిళ్ లో రీమేక్ చే్స్తున్నాడు. కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన పటాస్ చిత్రాన్ని తమిళ్ లో మొట్టట్టశివ కెట్టశివ అనే టైటిల్ పై రీమేక్ చేస్తున్నాడు లారెన్స్.

ఇందులో కేరక్టర్ ప్రకారం హీరో పోలీస్ అనే విషయం మనకు ఎప్పుడో తెలుసు. కోలీవుడ్ జనాలకు మాత్రం రీసెంట్ గానే పోలీస్ గెటప్ తో ఫస్ట్ లుక్ ఇచ్చాడు. గతంలో తనకు అచ్చొచ్చిన గుండు గెటప్ నే పోలీస్ పాత్రకు కూడా వాడేసుకుంటున్నాడు. లారెన్స్ ఇచ్చిన ఈ మోషన్ పోస్టర్ కు, ఫస్ట్ లుక్ కు ఆడియన్స్ రెస్పాన్స్ బాగానే వచ్చింది. అయితే.. ఇప్పుడు లారెన్స్ ఏకంగా తనను రజినీకాంత్ తో పోల్చద్దంటూ ట్వీట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. లారెన్స్ ఏంటీ రజినీకాంత్ తో పోలిక ఏంటి అనే డౌట్ సహజంగానే వస్తుంది. గతంలో ఓ మూవీలో రజినీకాంత్ పోలీస్ గెటప్ ను వెనుక బ్యాక్ గ్రౌండ్ లో ఉంచి, ముందు లారెన్స్ అదే మాదిరిగా ఫోజ్ ఇస్తున్న లారెన్స్ ఫోటో ఆ పిక్చర్ లో కనిపిస్తుంది.

'ఫ్రెండ్స్.. దయచేసి నన్ను రజినీ సార్ తో పోల్చకండి. ఆయన ముందు నేను చాలా చిన్నవాడిని' ట్వీట్ చేశాడు లారెన్స్. చూడ్డానికి ఇది కరెక్ట్ అనే అనిపిస్తున్నా.. లారెన్స్ నే కాదు... అసలే స్టార్ హీరోని అయినా సరే రజినీకాంత్ తో పోల్చేందుకు కాదు.. అలా ఊహించేందుకు కూడా తమిళ జనాలు, రజినీ ఫ్యాన్స్ ఇష్టపడరు. మరి ఈ కంపేరిజన్ ఫోటోను ఎవరు క్రియేట్ చేసుంటారబ్బా..? ట్విట్టర్ లో పెట్టాడు కాబట్టి లారెన్స్ మాత్రమే సమాధానం చెప్పగలడు.