Begin typing your search above and press return to search.
గెటప్స్ కుమ్మేస్తున్న సూపర్ స్టార్
By: Tupaki Desk | 20 Nov 2015 2:00 PM GMTసూపర్ స్టార్ సినిమాలంటే ఓ అంచనా ఉంటుంది. ఇలాంటి డ్యాన్సులు, ఇలాంటి ఫైట్స్ ఉంటాయని ఓ హైప్ - క్రేజ్ ఉంటాయి. వీటన్నిటినీ అందుకునేందుకు, తన అభిమానులకు ఏం కావాలో అవి చూపించేందుకు ట్రై చేస్తారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇప్పుడాయన చేస్తున్న మూవీ కబాలి.
కబాలిలో రజినీ సీరియస్ కేరక్టర్ పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ ఇచ్చిన లుక్స్ ఈ విషయాన్ని కన్ఫాం చేస్తున్నాయి. ఫ్యాన్స్ కి రజినీ ఎలా ఉన్నా నచ్చుతాడు కానీ... అభిమానులను అలరించడానికి ఆయన దగ్గర ప్రత్యేకమైన ఆయుధాలు చాలానే ఉంటాయి. ఎంటర్ టెయిన్ మెంట్ పాళ్లు ఏ మాత్రం తగ్గకుండా.. ఎల పిక్చర్ చేయాలో.. సూపర్ స్టార్ కి తెలిసినంతగా ఎవరికీ తెలీకపోవచ్చు కూడా. అందుకే ఓ కలర్ ఫుల్ సాంగ్ ప్లాన్ చేశారట రజినీకాంత్. ఈ సాంగ్ మళ్లీ పదేళ్ల క్రితం రజినీకాంత్ ని చూపించబోతున్నారని టాక్.
పైన కనిపిస్తున్న ఫోటో ఆ సాంగ్ లో భాగమే. వైట్ షర్ట్ - బ్లాక్ ప్యాంట్ లో రజినీ లుక్ అదుర్స్ కదూ. నరసింహ మూవీలో కిక్కు ఎక్కెలే..సాంగ్ లో ఇలానే కనిపించి ఇరగీసేసిన విషయం జనాలకి ఇంకా గుర్తుంది. ఇప్పుడు మళ్లీ అంత అద్భుతమైన పాటతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయనున్నారు రజినీ. ఇక ఈ కబాలికి తెలుగులో మహదేవ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. 2016 ఏప్రిల్ 14న కబాలి ప్రేక్షకుల ముందుకు రానుంది.