Begin typing your search above and press return to search.
పెట్ట ఫోటోలు లీక్..వింటేజ్ లుక్ లో రజిని
By: Tupaki Desk | 10 Sep 2018 7:42 AM GMTసూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో 'పెట్ట' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. మోషన్ పోస్టర్ ను గ్రాఫిక్స్ లో చిత్రీకరించినా రజనీ మాస్ హీరో లుక్ మాత్రం అందరికీ నచ్చింది. ఇక తాజాగా 'పెట్ట' సినిమా షూటింగ్ లొకేషన్ నుండి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లోని లక్నో సిటీలో జరుగుతోంది. అక్కడినుండి లీకయిన పిక్స్ లో రజనీ ఎరుపు రంగు కుర్తా ధరించి మెడలో నీలం రంగు స్కార్ఫ్ తో సూపర్ స్టైలిష్ గా ఉన్నారు. ఇక రజనీ హెయిర్ స్టైల్.. గడ్డం చూస్తే 1995 లో రిలీజ్ అయిన 'ముత్తు' సినిమా గెటప్ గుర్తొస్తోంది. ఆ వాకింగ్ స్టైల్.. లుక్ అంతా పాత రజనీ ని చూస్తున్నట్టుగా ఉంది. లీక్ అయిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఈ లీక్స్ తో అలర్ట్ అయిన 'పెట్ట' టీమ్ మొబైల్ ఫోన్స్ ను ఇతరా ఎలక్ట్రానిక్ పరికరాలను షూటింగ్ లొకేషన్ లో నిషేధించిందట. మరోవైపు రజనీకాంత్ కు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం 25 మంది పోలీసులతో భారీ సెక్యూరిటీ కల్పించిందట. ఈమధ్య కాలంలో షూటింగ్ సజావుగా జరగనివ్వకుండా కొంతమంది జనాలు అడ్డుపడుతుండడంతో అలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రభుత్వం ఇలా ముందుజాగ్రత్త తీసుకుందట. ఈ సినిమాలో రజినీ సరసన హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. విజయ్ సేతుపతి - సిమ్రన్ - నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.