Begin typing your search above and press return to search.

మేకింగ్‌: 2.ఓ ద‌శావ‌తారాలు

By:  Tupaki Desk   |   17 Nov 2018 7:16 PM GMT
మేకింగ్‌: 2.ఓ ద‌శావ‌తారాలు
X
గొప్ప క‌ల‌లు క‌నేవాడు గొప్ప సినిమా తీయ‌గ‌ల‌డు. టెక్నాల‌జీని ప్రేమించేవాడు టెక్నిక‌ల్ వండ‌ర్స్ ని క్రియేట్ చేయ‌గ‌ల‌రు. అలాంటి విజ‌న్ ఉన్న ఇద్ద‌రే ఇద్ద‌రు సౌత్‌ ద‌ర్శ‌కుల పేర్లు చెప్పాల్సి వ‌స్తే శంక‌ర్, రాజ‌మౌళి పేర్లు మాత్ర‌మే చెబుతాను అంటారాయ‌న‌. మీడియా క‌లిసిన ప్ర‌తిసారీ ఈ మాట‌ను ప‌దే ప‌దే పాఠంలా వ‌ల్లించేది ఎవ‌రో తెలుసా? ఆ న‌లుగురిలో ఒక్క‌డు - టాలీవుడ్ ట్యాలెంటెడ్ బిజినెస్ మ్యాగ్నెట్ డి.సురేష్ బాబు. భ‌విష్య‌త్ సినిమాని ఆ ఇద్ద‌రూ కొత్త పుంత‌లు తొక్కించ‌డంలో పోటీప‌డ‌తార‌ని చెబుతుంటారు.

నిజ‌మే.. బాహుబ‌లి లాంటి విజువ‌ల్ వండ‌ర్‌ని రాజ‌మౌళి అందిస్తే, ఇప్పుడు శంక‌ర్ మ‌రోసారి 2.ఓ (రోబో2) లాంటి విజువ‌ల్ వండ‌ర్‌ తో పోటీప‌డుతున్నారు. ఈ చిత్రంలో ఒక్కో పాత్ర‌ను అత‌డు డిజైన్ చేసిన తీరు.. టెక్నాల‌జీని అనుసంధానించిన వైనం... అసాధార‌ణ మేక‌ప్ ప్ర‌క్రియ‌ల్ని ఉప‌యోగించిన తీరు.. ప్ర‌తిదీ ముచ్చ‌ట గొల‌ప‌కుండా ఉండ‌దు. ఇంత‌కుముందు అక్ష‌య్ క్రోమ్యాన్ లుక్ మేకింగ్ వీడియోని రిలీజ్ చేసి వేడెక్కించారు. తాజాగా ర‌జ‌నీకాంత్ లోని వేరియేష‌న్స్ కి సంబంధించిన మేకింగ్ విజువ‌ల్స్ ని రిలీజ్ చేశారు. ఈ వీడియో ఆద్యంతం ర‌జ‌నీని డిఫ‌రెంట్ గెట‌ప్పుల్లో ఎలా మౌల్డ్ చేశారో చూపించారు. ప్రోస్త‌టిక్ మేక‌ప్ కోసం ఎంతో మంది సాంకేతిక నిపుణులు - మేక‌ప్ ఆర్టిస్టులు ప‌ని చేసిన తీరు మ‌తి చెడ‌గొడుతోంది. ఇది ఎంత గొప్ప ప్ర‌క్రియ‌. మేక‌ప్ వేసేందుకు 3 గంట‌లు ప‌డితే, తీసేందుకు అందులో స‌గం టైమ్ తీసుకుంటోంద‌ని అక్ష‌య్, ర‌జనీ ఇప్ప‌టికే చెప్పారు. `రోబో` సినిమాలో చిట్టీ పాత్ర‌కు విల‌న్ లుక్‌ ని ఆపాదించారు శంక‌ర్. ఇప్పుడు పార్ట్ 2లో అదే చిట్టీ హీరోగా మారింది. పైగా ఎమీజాక్స‌న్‌ తో ప్రేమ‌లోనూ ప‌డింది. అంటే ఆ పాత్ర‌తో తెర‌పై ఇంకెన్ని విన్యాసాలు సృష్టిస్తాడోన‌ని అనిపించ‌క మాన‌దు. రోబోటిక్ టెక్నాల‌జీని లుక్ డిజైన్‌ ని ప‌క్కాగా ఉప‌యోగించాడు శంక‌ర్. క్రోమ్యాన్‌ తో చిట్టీ భీక‌ర పోరాటాలు అదే రేంజులో క‌ట్టి ప‌డేయ‌నున్నాయ‌ని అర్థ‌మ‌వుతోంది. 60 ప్ల‌స్ వ‌య‌సులో ర‌జ‌నీని ఈ రేంజులో చూపించ‌డం అన్న‌ది శంక‌ర్‌కే సాధ్య‌మేమో. వ‌ర‌ల్డ్ లో హైఎండ్ టెక్నాల‌జీని ఉప‌యోగించి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈనెల 29న 2.ఓ ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.