Begin typing your search above and press return to search.
రజినీ మేనరిజమ్స్ మార్చేశాడట..
By: Tupaki Desk | 2 July 2016 5:33 AM GMTరజినీకాంత్.. స్టైల్ కు బ్రాండ్ అంబాసిడర్. సూపర్ స్టార్ పేరెత్తగానే కొన్ని సిగ్నేచర్ స్టైల్స్ కళ్ల ముందు మెదులుతాయి. చాలా వేగంగా సాగే నడక.. సిగరెట్ తాగడం.. అరచేతికి చూయింగ్ గమ్ విసిరి అది నోట్లో పడేలా చేసుకోవడం.. గాగుల్స్ పైకి విసిరి అవి సరిగ్గా కళ్ల మీదికి వచ్చి పడేలా చేసుకోవడం.. ఇలా అభిమానుల్ని మెస్మరైజ్ చేసే స్టైల్స్ చాలానే చూపిస్తుంటాడు రజినీ. ఎన్నిసార్లు చూపించినా కూడా ఇవేమీ బోర్ కొట్టవు. ఐతే సూపర్ స్టార్ కొత్త సినిమా ‘కబాలి’లో మాత్రం ఇలాంటి స్టైల్స్ ఏమీ ఉండవట. రజినీ మేనరిజాన్ని చాలా వరకు మార్చేశాడట దర్శకుడు పా రంజిత్. ‘కబాలి’ టీజర్ చూస్తేనే రజినీ గత సినిమాలతో పోలిస్తే భిన్నంగా కనిపించబోతున్న సంగతి అర్థమైంది.
ఇక సినిమాలో రజినీ ఇంకా చాలా మార్పు చూపిస్తాడట. రజినీలోని సీరియస్ స్టైల్ ను ఈ సినిమాలో రంజిత్ ఆవిష్కరించబోతున్నాడని కోలీవుడ్ వర్గాలంటున్నాయి. ప్రత్యేకంగా స్టైల్ కోసం స్టైల్ అన్నట్లు కాకుండా సినిమాలో అండర్ కరెంట్ గా ఆ స్టైల్ కనిపించేలా చూశాడట రంజిత్. ఇందులో రజినీ నుంచి కొన్ని కొత్త మేనరిజమ్స్ చూడొచ్చని.. ఈ సినిమాతో రజినీకి కొత్తగా అభిమానులు ఏర్పడుతారని రంజిత్ అంటున్నాడు. ఐతే ఈ ఊరింపులు బాగానే ఉన్నాయి కానీ.. అంతకంతకూ అంచనాలు పెరిగిపోతున్న ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందన్న క్లారిటీనే రావట్లేదు. జులై 15న పక్కా అనుకుంటుంటే.. రెండు మూడు రోజులుగా వాయిదా వార్తలు వినిపిస్తున్నాయి. రంజిత్ కానీ.. నిర్మాత కానీ.. ఆ ప్రచారాన్ని ఖండించకపోవడం సినిమా వాయిదా పడటం ఖాయమన్న ప్రచారాన్ని పెంచుతోంది.