Begin typing your search above and press return to search.

ర‌జ‌నీ కోసం MGR స్క్రిప్టు కాపీనా?

By:  Tupaki Desk   |   25 Oct 2018 12:29 PM IST
ర‌జ‌నీ కోసం MGR స్క్రిప్టు కాపీనా?
X
సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన రెండు సినిమాలు వెంట వెంట‌నే అభిమానుల‌కు ట్రీట్ ఇవ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. న‌వంబ‌ర్ 29న శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 2.ఓ రిలీజ్‌ కి రెడీ అవుతోంది. ఆ త‌ర్వాత కేవ‌లం రెండు నెల‌ల గ్యాప్‌ లోనే సంక్రాంతి బ‌రిలో కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ `పెట్టా` రిలీజ‌వుతోంది. ఒక‌టి సైఫై టెక్న‌లాజిక‌ల్ యాక్ష‌న్‌ మూవీ అయితే, వేరొక‌టి హార‌ర్ నేప‌థ్యం ఉన్న‌ థ్రిల్ల‌ర్ మూవీ. ఇవి రెండూ ర‌జ‌నీ అభిమానుల్ని ఖుషీ చేయ‌డం ఖాయ‌మ‌న్న చ‌ర్చ సాగుతోంది. త‌లైవా ఈజ్ బ్యాక్ ఎగైన్‌! అన్న మాటా వినిపిస్తోంది. ఓవైపు ర‌జ‌నీకాంత్ రాజ‌కీయారంగేట్రం గురించి వాడి వేడిగా చ‌ర్చ సాగుతుంటే - మ‌రోవైపు వరుస‌గా భారీ చిత్రాల‌కు సంత‌కాలు చేస్తూ - వెంట వెంట‌నే షూటింగులు పూర్తి చేస్తూ ర‌జ‌నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు.

ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ - ఏ.ఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌ లో సెట్స్‌ పైకి వెళ్ల‌నున్న సినిమా గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. గ‌త జూన్‌ లోనే ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి ముచ్చ‌ట మొద‌లైంది. అటుపై ఆగ‌స్టులోనూ వేడెక్కించే అప్‌ డేట్ అందింది. ర‌జ‌నీ కోసం మురుగ‌దాస్ స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. పెట్టా షూటింగ్ పూర్త‌వ్వ‌గానే ఇక మొద‌లు పెట్టేయ‌డ‌మేనంటూ ఒక‌టే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. తాజాగా మ‌రోసారి ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి కోలీవుడ్ మీడియాలో వేడెక్కించే ప్ర‌చారం సాగుతోంది. ర‌జ‌నీ రాజ‌కీయారంగేట్రం ముంగిట ఈసారి ఎంచుకునే స్క్రిప్టు రాజ‌కీయాంశాల‌తోనే ముడిప‌డి ఉంటుంద‌న్న చ‌ర్చా సాగుతోంది. అంతేకాదు లెజెండ‌రీ న‌టుడు - దివంత‌గ‌ నాయ‌కుడు - త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి ఎంజీఆర్ న‌టించిన ఓ సినిమా స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నార‌ట‌. ఆ మేర‌కు మురుగ‌దాస్ స్క్రిప్టు ప‌నుల్లో బిజీగా ఉన్నార‌ని తెలుస్తోంది. జ‌న‌వ‌రిలో ఈ సినిమాని ప్రారంభించేందుకు అత‌డు రెడీ అవుతున్నాడ‌ట‌. ప్ర‌ముఖ త‌మిళ క్రిటిక్ ర‌మేష్ బాలా ట్వీట్ చేస్తూ.. ``సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్- మురుగదాస్ మూవీ ఎంజీఆర్ న‌టించిన ఓ సినిమాని పోలి ఉంటుంద‌ని తెలుస్తోంది. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం సెట్స్‌ పై ఉన్న‌ ఆ ఇద్ద‌రి సినిమాలు పూర్త‌వ్వ‌గానే!`` అంటూ ట్వీట్ చేశారు.

అయితే ర‌మేష్ బాలా ట్వీట్‌ ల‌కు ర‌జ‌నీ ఫ్యాన్స్ స్పంద‌న‌లు అంతే వేడెక్కిస్తున్నాయి. ఎంజీ రామచంద్ర‌న్ (ఎంజీఆర్‌) స్క్రిప్టు కాపీనా? అయితే వ‌ద్దే వ‌ద్దు! అని ఓ ఫ్యాన్ రీట్వీట్ చేశారు. పాత‌ స్క్రిప్టుతో సినిమా చేయొద్దంటూ మురుగ‌దాస్‌ కి సూచిస్తున్నారు. చేస్తే ఒరిజిన‌ల్ స్క్రిప్టుతోనే ర‌జ‌నీ- మురుగ‌దాస్ సినిమా చూడాల‌ని ఆశ‌ప‌డుతున్నామ‌ని ట్వీట్లు చేస్తున్నారు. ఇక‌పోతే మురుగ‌దాస్ పై కాపీ క్యాట్ విమ‌ర్శ‌లు ఇటీవ‌లి కాలంలో అంత‌కంత‌కు పెరుగుతున్నాయి. ఆ క్ర‌మంలోనే ఎంజీఆర్ సినిమాకి ద‌గ్గర పోలిక‌లు అని చెప్ప‌డంతో ర‌జ‌నీ అభిమానులు కాస్త కంగారు ప‌డుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. 1917-1987 మ‌ధ్య ఎంజీఆర్ జీవించి ఉన్నారు. ఆయ‌న‌ సినీరాజ‌కీయ రంగాల్లో అసాధార‌ణంగా వెలిగిపోయారు. అందుకే ఎంజీఆర్ ఆశీస్సుల‌తోనే ర‌జ‌నీ రాజ‌కీయాల్లోకొస్తున్నాన‌ని ప్ర‌క‌టించిన వేళ ఎంజీఆర్ స్క్రిప్టుతో సినిమా అంటే ఎలా ఉంటుంది? అన్న చ‌ర్చా హీటెక్కిస్తోంది. ఒక‌వేళ ఎంజీఆర్ సినిమానే రీమేక్ చేస్తే దానిని అధికారికంగా ప్ర‌క‌టిస్తే ఏ స‌మ‌స్యా లేదు క‌దా? అన్న వాద‌నా మ‌రోవైపు వినిపిస్తోంది.