Begin typing your search above and press return to search.

ర‌జ‌నీ చిత్రం పేరేంటంటే?!

By:  Tupaki Desk   |   23 July 2015 6:22 AM GMT
ర‌జ‌నీ చిత్రం పేరేంటంటే?!
X
కొత్త సినిమాల దిశ‌గా ర‌జ‌నీకాంత్ వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్నాడు. రంజిత్ అనే ఓ యువ ద‌ర్శ‌కుడితో సినిమా చేయడానికి ఇప్ప‌టికే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. త‌దుప‌రి శంక‌ర్‌తో భారీ సినిమా ఉంటుంద‌ని స‌మాచారం. అందుకే ఇప్పుడు ఒప్పుకొన్న కొత్త సినిమాని చ‌క‌చ‌కా పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు ర‌జ‌నీ. `లింగ`లాంటి ఫ్లాప్ త‌ర‌వాత వ‌స్తున్న సినిమా ఇది. ఈసారి హిట్టు కొట్టే శంక‌ర్ చిత్రం కోసం బ‌రిలోకి దిగాల‌ని ర‌జ‌నీ డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. అందుకే క‌థ‌, క‌థ‌నాల విష‌యంలో చాలా కేర్ తీసుకొన్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. ఎంత‌మంది ద‌ర్శ‌కులు వ‌చ్చినా వాళ్ల‌ని కాద‌ని రంజిత్‌లాంటి యువ ద‌ర్శ‌కుడికి ఓకే చెప్పాడంటే కార‌ణం అదే.

రంజిత్ `మ‌ద్రాస్` అనే సినిమాని బాగా తీయ‌డం, త‌న కోసం త‌యారు చేసుకొన్న క‌థ‌లోనూ కొత్త‌ద‌నం ఉండ‌టంతో ర‌జ‌నీ ధైర్యంగా డెసిష‌న్ తీసేసుకొన్నాడు. త్వ‌ర‌లోనే ఈసినిమాని సెట్స్‌ పైకి తీసుకెళ్ల‌బోతున్నారు. ఇటీవ‌ల టైటిల్ కూడా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం. ` కాళి` అనే పేరుతో ర‌జ‌నీ కొత్త చిత్రం తెర‌కెక్క‌నున్న‌ట్టు తెలిసింది. ఇందులో క‌థానాయిక‌గా రాధికా ఆప్టేని ఎంచుకొన్న‌ట్టుగా ప్ర‌చారం సాగుతోంది. అయితే ఆ విష‌యం గురించి ఇప్ప‌టిదాకా క్లారిటీ రాలేదు. త్వ‌ర‌లోనే సినిమా పేరును, క‌థానాయిక వివ‌రాల్ని వెల్ల‌డించే అవ‌కాశం ఉంది.