Begin typing your search above and press return to search.
దేవుడా!! కబాలి డైరక్టర్ తో మళ్ళీ రజనీ
By: Tupaki Desk | 30 Aug 2016 4:11 AM GMTకబాలి.. రీసెంట్ టైమ్ లో దేశవ్యాప్తంగా విపరీతమైన బజ్ క్రియేట్ చేసిన సినిమా ఇది. బాలీవుడ్ సినిమాలకు కూడా చేతకాని వీలుకానంత స్థాయిలో హైప్ వచ్చేసింది. ఇదంతా కేవలం ఒకే ఒక టీజర్ చేసిన మాయ. రజినీకాంత్ ని బాషా తర్వాత మరోసారి పవర్ఫుల్ డాన్ గా చూపించబోతున్నారన్న ఒక్క టాక్ తో.. విపరీతమైన అంచనాల మధ్య ధియేటర్లలోకి వచ్చింది కబాలి. తీరా రిజల్ట్ ఏంటో మాత్రం అందరికీ తెలిసిందే.
ఇప్పుడు కబాలి డైరెక్టర్ పా రంజిత్ తో సూపర్ స్టార్ రజినీకాంత్ మరో సినిమా చేయనున్నారనే విషయం ఫైనల్ అయిపోయింది. 'వండర్ బార్ ఫిలిమ్స్ బ్యానర్ పై మా నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేస్తున్నందుకు సంతోషిస్తున్నా' అంటూ ఓ చిన్న వీడియో షేర్ చేశాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. హీరో సూపర్ స్టార్ రజినీ.. డైరెక్టెడ్ బై పా రంజిత్.. అందులో ఉన్న మ్యాటర్ అదే. స్వయంగా రజినీ అల్లుడు అనౌన్స్ చేశాక డౌట్స్ పెట్టుకోవాల్సిన పని లేదు. రోబో సీక్వెల్ 2.0 తర్వాత సూపర్ స్టార్ చేయబోయే సినిమా పా రంజిత్ తోనే అని ఫిక్స్ అయిపోవచ్చు.
కబాలి లాంటి స్లో నెరేషన్ తో సినిమా ఇచ్చిన రంజిత్ తో మరోసారి రజినీ సినిమా అంటే చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ.. కనీసం ఈ మాత్రమైనా అంచనాలు క్రియేట్ చేసి.. వసూళ్లను సీనియర్ డైరెక్టర్లు సాధించలేకపోయారు. కుర్రాడైనా ఈ విషయంలో సక్సెస్ అయిన పా రంజిత్ కే.. రజినీకాంత్ మరోసారి మొగ్గారనే విషయం అర్ధమవుతోంది. అన్నట్లు ఓ మాట చెప్పుకోవాలి.. కబాలి తమిళ్ వెర్షన్ ని హిట్ అనే అనాలి.