Begin typing your search above and press return to search.
సల్మాన్ తో చేయాలని ఉందన్న తలైవార్
By: Tupaki Desk | 21 Nov 2016 9:30 AM GMTరోబో సీక్వెల్ ఎంత గ్రాండ్ గా ఉండబోతుందో ఫస్ట్ లుక్ రిలీజ్ ఈవెంట్ చెప్పేసింది. సౌత్ మూవీ ఫంక్షన్ నార్త్ లో జరిగినప్పుడే దాని రేంజ్ అందరికీ తెలిసిపోయింది. ఇక ఈ కార్యక్రమానికి హజరైన అతిథులంతా ఒకెత్తుయితే.. సెంటరాఫ్ అట్రాక్షన్ మాత్రం సల్మాన్ ఖానే. విలన్ గా చేసిన అక్షయ్ కుమార్ కంటే గెస్ట్ గా వచ్చిన సల్మాన్ మీదే ఫోకసంతా. ఇక ఈవెంట్ కి వచ్చి రజనీకాంత్ అంటే తనకెంత ఇష్టమో చెప్పి తలైవార్ ని టచ్ చేసేశాడు సల్మాన్ భాయ్.
నిజానికి 2.0తో సల్మాన్ ఖాన్ కి ఎలాంటి సంబంధం లేదు. ప్రొగ్రామ్ కి రమ్మని ఎవరూ సల్మాన్ ని ఆహ్వానించలేదు కూడా. కానీ రజనీకాంత్ ముంబైలోనే ఉన్నారని తెలిసి.. ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న 2.0 ఫస్ట్ లుక్ లాంఛ్ ఈవెంట్ ముంబైలో జరుగుతుందని తెలిసి ఇన్విటేషన్ లేకపోయినా వచ్చేశాడు. మరి సల్మాన్ వస్తానంటే ఎవరైనా ఆపుతారా..? సల్మాన్ ఇచ్చిన సడెన్ ఎంట్రీకి సర్ ప్రైజైన రజనీ ఎంత హ్యాపీ ఫీలయ్యారో ఆయన ఫేస్ లో కొట్టొచ్చినట్టు కనిపించింది.
రజనీకాంత్ మీద ఉన్న అభిమానాన్ని దాచుకోకుండా సల్మాన్ ఎక్స్ ప్రెస్ చేస్తే.. ఛాన్స్ వస్తే సల్మాన్ తో నటిస్తానంటూ తలైవార్ ప్రకటించేశారు. భాయ్ ఒప్పుకోవాలి కానీ రేపట్నుంచే షూటింగ్ స్టార్ట్ చేసినా నేను రెడీ అనేశారు. రజనీకాంత్ తన ఫేవరెట్ అని సల్మాన్ చాలాసార్లు చెప్పాడు. కలెక్షన్స్ విషయంలో తలైవార్ పోటీ పడతారా అని అప్పుడెప్పుడో ఓ సారి అడిగితే నేనే కాదు క్రేజ్.. కలెక్షన్స్ విషయంలో ఎవరూ రజనీని బీట్ చేయలేరంటూ స్టేటిమెంట్ ఇచ్చేశాడు. మరి ఇప్పుడు రజనీనే ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.. కలిసి యాక్ట్ చేయడానికి సల్మాన్ రెడీనా చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/