Begin typing your search above and press return to search.

కబాలి క్లైమాక్స్.. కాస్త రిస్కీగానే..

By:  Tupaki Desk   |   19 July 2016 5:30 PM GMT
కబాలి క్లైమాక్స్.. కాస్త రిస్కీగానే..
X
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి మూవీ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే ఇంటర్నేషనల్ రిలీజ్ కు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయిపోగా.. రిలీజ్ నుంచి వసూళ్ల వరకూ చాలా రికార్డులను రజినీ బద్దలు కొట్టేస్తాడనే అంచనాలున్నాయి.

కొత్త దర్శకుడైనా రంజిత్ పా పై రజినీకాంత్ నమ్మకం ఉంచి ఈ ప్రాజెక్ట్ చేశారు. అయితే.. ఈ మూవీ స్టోరీని నేరేట్ చేసినప్పుడు.. సూపర్ స్టార్ కు నెగిటివ్ క్లైమాక్స్ ను చెప్పాడట దర్శకుడు. రజినీకి ఈ క్లైమాక్స్ వెర్షన్ బాగా నచ్చినా.. ఆయన కూతురు సౌందర్య మాత్రం సంతృప్తి చెందలేదట. ఈ క్లైమాక్స్ మార్చి తీసుకురావాలని సూచించిందట. కానీ రజినీకాంత్ మాత్రం నిర్ణయాన్ని దర్శకుడికే వదిలేయమని చెప్పాడని తెలుస్తోంది. మరిప్పుడు కబాలి ఎండింగ్ పాజిటివ్ గా ఉంటుందో.. నెగిటివ్ గా ఉందో తెలియడం లేదు.

దర్శకుడు పా రంజిత్ మాత్రం నెగిటివ్ క్లైమాక్స్ ఈ చిత్రానికి కరెక్ట్ గా పండుతుందని ముందునుంచే చెబుతున్నాడని టాక్. వాస్తవానికి తమిళ్ ఆడియన్స్ నెగిటివ్ క్లైమాక్స్ బాగానే యాక్సెప్ట్ చేస్తారు. కానీ రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ విషయంలో ఈ నెగిటివ్ క్లైమాక్స్ ఏదన్నా తేడా చేస్తుందేమో అని ఫీలవుతున్నారు ఫ్యాన్స్.