Begin typing your search above and press return to search.
ఎంట్రీకి ముందు ఒకే ఒక్క సినిమా
By: Tupaki Desk | 19 Feb 2018 6:56 AM GMTకోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి ఎప్పుడు డైరెక్ట్ గా అడుగుపెడతారా అని గత కొంత కాలంగా చాలా మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే పాలిటిక్స్ లోకి అడుగుపెట్టేముందు ఒక మంచి పాలిటిక్స్ తరహా చిత్రంతో జనాలకు దగ్గరవ్వాలని రజినీ అనుచరులు ఆయనకు సలహాలను ఇస్తున్నారు. ఇప్పటికే 2 పాయింట్ 0 - కాలా సినిమాలను పూర్తి చేసిన రజినీ మరికొన్ని కథలను వింటున్నాడట.
ఈ ఏడాది ఎలాగు ఆ రెండు సినిమాలు తప్పకుండా రిలీజ్ అవుతాయి. ఇక డైరెక్ట్ గా రాజకీయాల్లోకి రావడానికి సూపర్ స్టార్ సన్నాహకాలు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పాల్గొనడానికి ముందు కరెక్ట్ గా ఒక సినిమాను రిలీజ్ చేయాలనీ కూడా ఆయన ప్లాన్ చేస్తున్నారు. చాలా మంది దర్శకులతో కొందరు నిర్మాతలు అందుకు తగ్గట్టుగా కథలను రాయిస్తున్నారట. ఫైనల్ గా ఎవరిది సెట్ అయితే వారితో సినిమాను పట్టాలెక్కిస్తాడట తలైవా.
ఇటీవల రజినీకాంత్ కొన్ని కథలను కూడా విన్నట్లు తెలుస్తోంది. కార్తీక్ సుబ్బరాజు - అట్లీ అండ్ అరుణ్ కుమార్ వంటి సూపర్ హిట్ దర్శకులు మంచి మెస్సేజ్ ఉన్న కథలను ఎవరి స్టైల్ లో వారు వినిపించారట. రజినీ బావున్నాయని చెప్పాడట గాని ఇంకా ఫైనల్ డిసిషన్ చెప్పలేదని సమాచారం. ఒకవేల ఆయన ఒకే చెబితే భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించడానికి కొన్ని నిర్మాణ సంస్థలు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి. మరి ఆ సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి.