Begin typing your search above and press return to search.
రొయ్య మీసం బావుందయ్యో!
By: Tupaki Desk | 4 Oct 2018 5:37 PM GMTప్రయోగం కేరాఫ్ రజనీకాంత్. సూపర్ స్టార్ తన కెరీర్ లో చేయని ప్రయోగమే లేదు. కెరీర్ ఆద్యంతం అతడు లుక్ పరంగా కానీ - కథల ఎంపిక పరంగా కానీ ఏ ఇతర హీరోతో పోల్చినా ప్రయోగాత్మకత కనిపిస్తుంది. సిగరెట్ గాల్లో ఎగరేసి పెదవి అంచుతో అందుకుని ఆ రోజుల్లోనే ప్రయోగాల హీరోగా రికార్డులకెక్కారు. కాలర్ మడత పెట్టి మాస్ అవతార్‌ని ఆవిష్కరించినా.. ఆటోవాలా చొక్కా తొడుక్కుని కార్మికుడిగా కనిపించినా - చంద్రముఖిలో లకలకలక అంటూ కొత్త ఆహార్యం ప్రదర్శించినా - లుంగీ కట్టి స్టెప్పులేసినా - మాఫియా డాన్ మాణిక్ బాషాని తలపించినా... శత్రువుల భరతం పట్టే చిట్టీ రోబోట్ గా మారినా అవన్నీ ఆయనకే చెల్లాయి. గెటప్ వైజ్ ప్రయోగాలు ఆయన తర్వాతే ఎవరైనా.
ఇటీవలే కబాలి - కాలా చిత్రాల్లో డాన్ పాత్రల్లో మెప్పించారు. పండిన తలకట్టు - మీసం- గడ్డంతో మాస్ అవతార్ లో కనిపించి ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో సర్ ప్రైజ్ చేశారు. అయితే ఇకపై అంతకుమించి కొత్తగా కనిపించడమెలా? అంటే ఆ ప్రశ్నకు సమాధానంగా ఈరోజు ఒక కొత్త లుక్ ని `పెట్టా` టీమ్ రిలీజ్ చేసింది. మునుపటితో పోలిస్తే .. రజనీ మరోసారి తన పాత క్లాసిక్ రోజుల్ని గుర్తు చేసినట్టయ్యింది. మరోసారి ముత్తు - అరుణాచలం గెటప్‌కి మారిపోయారు. నరసింహా గెటప్‌ని తలచుకునేలా చేశారు.
ఈ కొత్త గెటప్ లో ఎంతో యంగ్ బోయ్ లా మారిపోయాడు. వయసు సగం తగ్గించేశారు. నుదిటిన తంబీ మార్క్ నామంబొట్టు.. ఆపై కుంకుమ బొట్టు.. సిల్కు బ్రాండు తెల్లచొక్కాయ్ అబ్బబ్బో రజనీ కొత్తగా మారిపోయారే అనిపించకమానదు. ముఖ్యంగా తనదైన మార్క్ ని గుర్తు చేసేలా ముందుకు దువ్విన ఆ ఫంకు అదరహో! అన్నట్టే ఉంది. వీటన్నిటినీ మించి రొయ్య మీసం హైలైట్. రాయుడిలా.. రోషగాడిలా తిప్పేశాడు మీసాన్ని!! ఈసారికి పూర్తిగా యంగ్ బోయ్ గా మారిపోయాడంటే రజనీ చాలా పెద్ద ప్రయోగానికే రెడీ అవుతున్నాడన్నమాట. పెట్టా హారర్ కాన్సెప్ట్ మూవీ. పిజ్జా ఫేం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. వారణాసిలో ప్రస్తుతం చిత్రీకరణ సాగుతోంది. 2019 సంక్రాంతికి బాలయ్య `ఎన్టీఆర్` సినిమాకి పోటీగా వదులుతారట ఈ చిత్రాన్ని.