Begin typing your search above and press return to search.
సంక్రాంతి రిలీజ్..ఒక పోస్టరైనా వదలండయ్యా
By: Tupaki Desk | 27 Dec 2018 4:14 AM GMTసూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా ‘పేట్ట’ తెలుగులో రిలీజవుతుందా లేదా అనే సస్పెన్సుకు కొన్ని రోజుల కిందటే తెరపడింది. ‘నవాబ్’.. ‘సర్కార్’ చిత్రాల్ని తెలుగులో రిలీజ్ చేసిన ‘వల్లభనేని అశోక్ ఈ చిత్ర తెలుగు డబ్బింగ్ హక్కులు సొంతం చేసుకున్న సంగతి వెల్లడైంది. కానీ అంతకుమించి సినిమా గురించి అప్ డేటే లేకపోయింది. తాజాగా ‘పేట్ట’ను తెలుగులోనూ సంక్రాంతికే రిలీజ్ చేయబోతున్నట్లుగా ధ్రువీకరిస్తూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
తమిళంలో అయితే ‘పేట్ట’ జనవరి 10న విడుదల కాబోతోంది. కాబట్టి అదే రోజు తెలుగు వెర్షన్ కూడా విడుదల కావచ్చు. ఐతే రిలీజ్ కు మిగిలిందిక సరిగ్గా రెండు వారాలు మాత్రమే. కానీ ఇప్పటిదాకా తెలుగు వెర్షన్ పోస్టర్ కూడా రిలీజవ్వలేదు. అసలు తెలుగులో సరిగ్గా ఈ సినిమా పేరు కూడా ఇంకా జనాలకు తెలియదు. తమిళంలో ‘పేట్ట’ అంటున్నారు. దాన్ని తెలుగులో ‘పేట’గా మారుస్తారా.. ఆ పేరు మన ప్రేక్షకులకు ఎక్కుతుందా.. అన్నది సందిగ్ధమే. విడుదలకు రెండు వారాలే సమయం ఉండగా.. సూపర్ స్టార్ సినిమాకు కనీసం తెలుగులో ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయలేకపోవడాన్ని ఏమనాలి?
కొంచెం లేటుగా హక్కులు తీసుకోవడం వల్ల డబ్బింగ్ పనుల్లో హడావుడి నెలకొని ఉండొచ్చు. అలాగని పబ్లిసిటీ విషయంలో వెనుకబడితే కష్టం. అసలే సంక్రాంతికి భారీ చిత్రాల మధ్య పోటీకి దిగుతోంది. అలాంటపుడు కనీస స్థాయిలో ప్రమోషన్లు ఉండాలి. రజనీకి తెలుగులో కూడా భారీగానే అభిమానగణం ఉంది. వాళ్లను దృష్టిలో ఉంచుకుని అయినా ప్రమోషన్లు మొదలుపెట్టాలి. ఒకవైపు తమిళంలో పబ్లిసిటీ పతాక స్థాయిలో ఉండగా.. ఇక్కడ సినిమాను గాలికి వదిలేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. మరి ఇంకెప్పుడు ప్రమోషన్ హడావుడి మొదలవుతుందో?