Begin typing your search above and press return to search.
ఫొటోటాక్ : లంబోర్గిని డ్రైవింగ్ లో సూపర్ స్టార్
By: Tupaki Desk | 21 July 2020 7:50 AM GMTకరోనా కారణంగా సెలబ్రెటీలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. ఈమద్య కాలంలో రెగ్యులర్ గా స్టార్స్ కు చెందిన ఫొటోలు షేర్ అవుతున్నాయి. అయితే రజినీకాంత్ కు చెందిన ఫొటోలు మాత్రం ఎక్కువగా రాకపోవడంపై ఆయన అభిమానులు నిరుత్సాహంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో రజినీకాంత్ ఈ ఫొటోను షేర్ చేశాడు. నిత్యావసరాల కోసం తానే స్వయంగా కారులో వెళ్తున్నట్లుగా రజినీకాంత్ పేర్కొన్నాడు.
లంబోర్గిని కారులో స్వయంగా డ్రైవ్ చేస్తూ రజినీకాంత్ రయ్ మంటూ వెళ్తున్న నేపథ్యంలో ఈ ఫొటోను ఆయన ఫ్యాన్స్ తెగ లైక్ చేస్తున్నారు. ఈ ఫొటోతో పాటు లయన్ ఇన్ లంబోర్గిని అనే హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. కొన్ని నిమిషాల వ్యవధిలో వేలాది ట్వీట్స్ పడ్డాయి. ఆయన లయన్ మాదిరిగా ఉన్నాడంటూ ఫ్యాన్స్ ఈ హ్యాష్ ట్యాగ్ లో కామెంట్ పెడుతున్నారు. రజినీకాంత్ ఈ ఏడాది మొత్తం కూడా షూటింగ్ లో పాల్గొనను అంటూ క్లారిటీ ఇచ్చాడు.
కుటుంబ అవసరాల కోసం మాత్రం ఇలా బయటకు అప్పుడప్పుడు సొంతంగా వెళ్తున్నాడు. ఈ సమయంలో రజినీకాంత్ ముక్కు మరియు నోరుకు ఎన్ 95 మాస్క్ ను ధరించడం కూడా చూడవచ్చు. ఇక రజినీకాంత్ సినిమా విషయానికి వస్తే శివ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ దాదాపుగా సగం పూర్తి అయ్యింది. వచ్చే ఏడాదిలో మిగిలిన బ్యాలన్స్ వర్క్ పూర్తి చేసే అవకాశం ఉంది. సినిమాను వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.