Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ నిర్ణయం.. అంతా హ్యాపీ
By: Tupaki Desk | 5 Feb 2019 6:38 AM GMTసూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన 'పేట' చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుని భారీగా వసూళ్లను కూడా రాబట్టింది. అయితే సినిమాకు భారీగా ఖర్చు చేయడం, డిస్ట్రిబ్యూటర్లకు ఎక్కువ రేటుకు అమ్మడం వల్ల 'పేట' చిత్రం మంచి వసూళ్లు దక్కించుకున్నా నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్లు లాభాలను దక్కించుకోలేక పోయారు. అందుకే రజినీకాంత్ తన తదుపరి చిత్రం విషయంలో అలా జరగకూడదని నిర్ణయించుకున్నాడు.
రజినీకాంత్ తదుపరి చిత్రం మురుగదాస్ దర్శకత్వంలో ఉండబోతుంది. ఆ సినిమాకు బడ్జెట్ పరిమితి విధించినట్లుగా తెలుస్తోంది. దాంతో పాటు పారితోషికంను కూడా రజినీకాంత్ భారీగా తగ్గించుకున్నట్లుగా తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పారితోషికం తగ్గించుకోవడం వల్ల నిర్మాతకు బడ్జెట్ పెరగదు, దాంతో డిస్ట్రిబ్యూటర్లకు తక్కువ రేటుకు సినిమా రైట్స్ ను నిర్మాత అమ్ముతాడు. అలా డిస్ట్రిబ్యూటర్, నిర్మాత, ఎగ్జిబ్యూటర్స్ అంతా కూడా సినిమా మామూలుగా విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా లాభాలను దక్కించుకోవచ్చు.
రజినీకాంత్ గత చిత్రాలన్ని కూడా మంచి వసూళ్లను రాబట్టినా కూడా డిస్ట్రిబ్యూటర్లను మరియు ఎగ్జిబ్యూటర్లను భారీ నష్టాల్లో ముంచాయి. దాంతో రజినీకాంత్ ఎట్టకేలకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. గతంలో డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునేందుకు తన పారితోషికంను త్యాగం చేసిన రజినీకాంత్ మరోసారి అదే విధంగా తన పారితోషికంను తగ్గించుకుని డిస్ట్రిబ్యూటర్లు మరియు ఎగ్జిబ్యూటర్ల కోసం పాటు పడుతున్నాడంటూ తమిళ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.