Begin typing your search above and press return to search.
రజని కొత్త సినిమాలో షాకింగ్ ట్విస్ట్!
By: Tupaki Desk | 21 Feb 2019 9:55 AM ISTసూపర్ స్టార్ రజనీకాంత్ తెలుగులో అందుకుంటున్న చేదు ఫలితాలను పక్కన పెడితే కోలీవుడ్ లో మాత్రం తలైవా ఈజ్ బ్యాక్ అనే రేంజ్ లో దూకుడు పెంచేసాడు. పేట ఇక్కడ డిజాస్టర్ అయ్యింది కాని తమిళనాడు లో టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచి రజని స్టామినాని మరోసారి రుజువు చేసింది. ఇదిలా ఉండగా రజని తన నెక్స్ట్ మూవీ మురుగదాస్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. హీరొయిన్ గా నయనతారను ఆల్మోస్ట్ ఫిక్స్ చేసినట్టు సమాచారం.
దీనికి సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్ డేట్ చెన్నై మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం ఇందులో రజనికాంత్ చాలా ఏళ్ళ తర్వాత డ్యూయల్ రోల్ చేయబోతున్నాడట. ఒక పాత్ర పోలీస్ ఆఫీసర్ గా మరోపాత్ర సోషల్ వర్కర్ గా రెండూ ఒకదానికి ఒకటి సంబంధం లేని రీతిలో సాగుతాయని సమాచారం. ఇది విన్న రజని ఫ్యాన్స్ ఆనందం మాములుగా లేదు రజని డ్యూయల్ రోల్ చేసి దశాబ్దాలు దాటింది.
ఇంతకు ముందు ముత్తు-అరుణాచలం-లింగాలో చేసినా అవి ఒకే ఫ్రేమ్ లో రెండు పాత్రలు కలుసుకునే సినిమాలు కావు. ఫ్లాష్ బ్యాక్ లో ఒకటి వర్తమానంలో మరొకటి వస్తాయి. కాని మురుగదాస్ సినిమాలో మాత్రం డ్యూయల్ రోల్స్ సమాంతరంగా సాగుతాయని టాక్. రజని డబుల్ ఫోటో మూవీస్ లో చాలా ప్రత్యేకంగా క్లాసిక్ గా చెప్పబడే మూండ్రు ముగం స్టైల్ లో మురుగదాస్ సోషల్ మెసేజ్ ని మిస్ చేయకుండా పక్కా స్క్రిప్ట్ ని రెడీ చేస్తున్నాడట. అనిరుద్ రవిచందర్ పేట తర్వాత రెండోసారి రజని సినిమాకు ట్యూన్స్ ఇస్తున్నాడు. ఇప్పటికే సిటింగ్స్ పూర్తయ్యాయని సమాచారం. చిన్న కూతురు రెండో పెళ్లి కోసం ఓపెనింగ్ ఆలస్యం చేసిన రజనికాంత్ త్వరలోనే సెట్స్ లోకి అడుగు పెట్టనున్నాడు