Begin typing your search above and press return to search.
ఆ విధంగా '2 పాయింట్ ఓ'కు దెబ్బేశాడు
By: Tupaki Desk | 1 Jan 2018 5:41 AM GMTకొత్త సంవత్సరం వచ్చేసింది. ఇక మరో మూడు నెలల్లో రాబోయే సమ్మర్ కోసం ఇప్పటినుండి ఫిలిం లవర్స్ అందరూ పడిగాపులు కాస్తున్నారు. అయితే ఈ సమ్మర్లో తెలుగు సినిమాల విషయంలో ఢోకా లేదు కాని.. డబ్బింగ్ క్యాటగిరీలో వచ్చే సూపర్ స్టార్ '2 పాయింట్ ఓ' మాత్రం మన సినిమాల డేట్లను ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇక టాలీవుడ్ లో ఈ సినిమా తాలూకు ప్రభావం పక్కన పెడితే.. అసలు కోలీవుడ్ లో ఈ సినిమాకు డిఫరెంట్ ఫ్యూచర్ ఉండే ఛాన్సుందని అంటున్నారు విశ్లేషకులు. పదండి చూద్దాం.
ఒక రకంగా శంకర్ డైరక్షన్ లో రూపొందిన ఈ 200 కోట్ల రూపాయల సైన్స్ ఫిక్షన్ సినిమాకు దెబ్బేసింది రజనీకాంత్ అంటారా? అని అడిగితే.. అవుననే చెబుతున్నారు సినిమా పండితులు. దానికి కారణం.. ఆయన పార్టీ పెడుతున్నాను అంటూ ప్రకటించడం. విషయం ఏంటంటే.. రజినీకి ఊర మాస్ ఫ్యాన్స్ ఎక్కువ. బి అండ్ సి సెంటర్లన్నీ ఆయనకు ఫిదా. అయితే ఆ సెంటర్లలోనే ఎక్కువగా చాలామంది ఏఐడింఎంకె మరియు డిఎంకె పార్టీల వర్గీయులు ఉన్నారు. సౌత్ చెన్నయ్ - కొయంబత్తూరు - మధురై వంటి ముఖ్యమైన రాజకీయా స్థావరాలన్నీ ఈ పార్టీలు పంచుకున్నాయి. ఇప్పుడు ఆ పార్టీల్లోని రజినీ అభిమానులు.. ఈయన పెట్టబోయే కొత్తపార్టీకి సపోర్టు ఇద్దాం అనుకుంటే పర్లేదు.. అలా కాకుండా ఆయన మీద హర్ట్ అయితే మాత్రం.. ఆ ప్రభావం సినిమా రిజల్ట్ మీద పడకమానదు. వారందరూ మూకుమ్మడిగా చూడ్డం మానేస్తే.. అసలుకే మోసం వస్తుంది.
ఆల్రెడీ రజినీ ఇలా పార్టీ పెడతా అన్నాడో లేదో.. అక్కడ అలా ఆయనపై చురకలు వేయడం మొదలెట్టేశారు జనాలు. ఆయన రాజకీయాలకు పనికిరాడని ఒకరు.. అబ్బే ఇదంతా జస్ట్ హంగామా అని మరొక పార్టీవారు కామెంట్లు చేశారు. ఈ సమయంలో 2 పాయింట్ ఓ సినిమా రిజల్ట్ రాజకీయాలకు అతీతంగా ఉండబోతుందా? ఉంటుందా? అనేది చూడాల్సిన విషయమే గురూ.