Begin typing your search above and press return to search.
సూపర్ స్టారుకి ‘పులి’ తెగ నచ్చేసిందట
By: Tupaki Desk | 5 Oct 2015 1:30 PM GMTపులి.. విజయ్ కెరీర్ లో ఎప్పటికీ మరిచిపోలేని సినిమా. అలాగని అదేమీ తీపి జ్నాపకం కాదు. విజయ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అతడికి అతి పెద్ద ఫ్లాపుల్లో ఒకటిగా నిలిచింది. విజయ్ కెరీర్ లో డిజాస్టర్లు లేకేం లేదు కానీ.. మరీ ఈ స్థాయిలో తొలి షో నుంచే దారుణమైన టాక్ వచ్చిన సినిమాలు చాలా తక్కువ. విజయ్ ఫ్యాన్స్ సైతం ఈ సినిమాపై పెదవి విరుస్తున్నారు. ఇలాంటి సిల్లీ సినిమాను విజయ్ ఒప్పుకోవడం.. నిర్మాతలు వంద కోట్లకు పైగా బడ్జెట్ పెట్టడం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి సమయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ‘పులి’ మీద ప్రశంసలు కురిపించారన్న వార్త షాకిస్తోంది.
రజినీకాంత్ నేరుగా పులి గురించి ఎక్కడా మాట్లాడలేదు కానీ.. రజినీ తమకు ఫోన్ చేసి మరీ అభినందించారని అంటున్నారు ‘పులి’ నిర్మాతలు. ‘పులి’ సినిమాను ఓ స్పెషల్ షో వేయించుకుని రజినీ చూశారని.. సినిమా పూర్తయిన వెంటనే తమకు ఫోన్ చేసి ఇలాంటి ఫాంటసీ యాక్షన్ మీద నమ్మకంగా అంత ఖర్చు పెట్టినందుకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి తమను అభినందించారని.. ఈ మూవీతో సౌత్ లో రీఎంట్రీ ఇచ్చిన శ్రీదేవికి అభినందనలు తెలపాల్సిందిగా చెప్పారని ఎస్కేటీ స్టూడియోస్ ట్విట్టర్ లో వెల్లడించింది. విజయ్ యాక్టింగ్ అమోఘమని.. హాలీవుడ్ స్థాయిలో తీసిన ఇలాంటి సినిమాల్ని అందరూ ప్రోత్సహించాలని రజినీ అన్నాడని కూడా నిర్మాతలు చెప్పుకున్నారు. రజినీకి నిజంగా సినిమా అంత నచ్చి ఉంటే.. నేరుగా ట్విట్టర్ లో ‘పులి’ మీద ఓ పోస్టు పెడితే బావుండేది కదా. ఇలా నిర్మాతలకు ఫోన్ చేసి గుట్టుగా ఎందుకు సినిమాను పొగిడినట్లో?