Begin typing your search above and press return to search.
ఎస్పీ బాలు కోసం సామూహిక ప్రార్థనలు
By: Tupaki Desk | 20 Aug 2020 4:40 PM ISTగాన గంధర్వుడు.. దేశంలోనే ప్రముఖ గాయకుడు అయిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో పోరాడుతున్నారు. ఆ మహమ్మారి బారినపడి ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న బాలు త్వరగా కోలుకోవాలని కోరుతూ సినీ ప్రముఖులంతా ఇవాళ సాయంత్రం 6-6.05 నిమిషాల సమయంలో ఎవరి ఇళ్లలో వారు ప్రార్థించాలని డిసైడ్ అయ్యారు.
ఈ సందర్భంగా ఈ ప్రార్థనలో పాల్గొనాలని ప్రముఖ దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ కోరారు. బాలు మేలు కోరేవారంతా ఆయన పాటను ప్లే చేస్తూ ప్రార్థనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఇక రజినీకాంత్ తోపాటు కమల్ హాసన్ - ఇళయరాజా - రెహమాన్ - థమన్ - లాంటి ప్రముఖులు కూడా ఈ ఉమ్మడి ప్రార్థనల్లో భాగంగా కావాలని సోషల్ మీడియా ద్వారా అభిమానులను కోరారు.
ఈ సందర్భంగా అందరూ అభిమానుల కోరిక మేరకు దేవుడు ఈ సామూహిక ప్రార్థనలను వింటాడని.. బాలును కోలుకునేలా చేస్తాడని రజినీకాంత్ ఆశాభావం వ్యక్తంచేశాడు.