Begin typing your search above and press return to search.
కాలాపై బ్యాన్ కు కారణమేంటి?:తలైవా
By: Tupaki Desk | 30 May 2018 6:11 AM GMTకర్ణాటక-తమిళనాడు మధ్య కొంత కాలంగా నడుస్తోన్న కావేరీ జల వివాదం నేపథ్యంలో కర్ణాటకలో `కాలా`విడుదలకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాలని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. దీంతో, స్వతహాగా 7కన్నడిగుడైన రజనీ....తమిళనాడుకు మద్దతుగా మాట్లాడడంపై కర్ణాటక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే జూన్7న కర్ణాటకలో `కాలా`ను విడుదల కానివ్వబోమంటూ కన్నడ ప్రజలు - ప్రజా సంఘాలు ఆందోళన చేశాయి. దీంతో, కాలా విడుదలను నిలిపివేస్తూ కర్ణాటక ఫిలిం ఛాంబర్ నిర్ణయించింది. కన్నడనాట డిస్ట్రిబ్యూటర్లు - ఎగ్జిబిటర్లు మూకుమ్మడిగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా, ఈ వ్యవహారంపై తలైవా స్పందించారు. ఆ నిర్ణయం తనను షాక్ కు గురిచేసిందని రజనీ అన్నారు.
కర్ణాటకలో `కాలా `విడుదలయ్యేలా సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చొరవ తీసుకుకోవాలని తలైవా కోరారు. కర్ణాటకలో తన చిత్రాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారో తనకు తెలియదని రజనీ అన్నారు. తన సినిమాను కర్ణాటలకో నిషేధించడానికి గల కారణాలేమిటో తనకు అర్థం కావడం లేదన్నారు. ఈ విషయంలో సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జోక్యం చేసుకోవాలని, తన సినిమా విడులకు మార్గం సుగమం చేయాలని రజనీ కోరారు. గతంలో బాహుబలి-2 విడుదలకు ముందు కూడా తమిళ నటుడు సత్యరాజ్...కావేరీ జలాలపై చేసిన వ్యాఖ్యలకు గానూ ఆ చిత్ర విడుదలను కన్నడిగులు అడ్డుకున్నారు. ఆ తర్వాత కర్ణాటక ఫిలిం ఛాంబర్ తో సత్యరాజ్ - చిత్ర నిర్మాతలు చర్చలు జరిపిన అనంతరం విడుదల చేశారు. తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటోన్న తలైవా సినిమా విషయంలో కర్ణాటక ఫిలిం ఛాంబర్ తమ పట్టు విడుస్తుందో లేదో చూడాలి.