Begin typing your search above and press return to search.

600కోట్లు నిజ‌మా ర‌జ‌నీ?

By:  Tupaki Desk   |   3 Nov 2018 8:11 AM GMT
600కోట్లు నిజ‌మా ర‌జ‌నీ?
X
సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్ - శంక‌ర్ కాంబినేష‌న్‌ లో తెర‌కెక్కుతున్న `2.ఓ` సినిమా వాస్త‌వ బ‌డ్జెట్ ఎంత‌? గ‌త కొంత‌కాలంగా అభిమానుల్లో - ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర డిబేట్ ఇది. ఈ సినిమాకి దాదాపు 550 కోట్ల బ‌డ్జెట్ ఖ‌ర్చ‌యింద‌ని ఓ కార్య‌క్ర‌మంలో శంక‌ర్ ప్ర‌క‌టించ‌డంతో అంత పెద్ద మొత్తం ఖ‌ర్చయ్యిందా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. దీనిపై టాలీవుడ్‌ లోనూ ర‌క‌ర‌కాలుగా గుస‌గుస‌లు సాగాయి. వాస్త‌వ బ‌డ్జెట్‌ ని మించి దీనిపై ప్ర‌చారం చేస్తున్నార‌న్న చ‌ర్చా సాగింది. ప్ర‌ఖ్యాత బాలీవుడ్ క్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్‌కి చెందిన‌ ఓ ప్ర‌ముఖ బాలీవుడ్ వెబ్‌ సైట్ అయితే 2.ఓ చిత్రానికి అంత పెద్ద మొత్తం ఖ‌ర్చ‌వ్వ‌లేదు. వీఎఫ్ ఎక్స్ వ‌ర్క్ తుస్సుమ‌న్నా.. మ‌రోసారి వీఎఫ్ ఎక్స్ చేయించినా ఈ సినిమాకి కేవ‌లం రూ.400కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చ‌యింద‌ని తెలిపింది.

అయితే ఇది నిజ‌మా? అస‌లు వాస్త‌వ‌మేంటి? అంటూ ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా దీనిపై ఆస‌క్తిక‌ర‌ చ‌ర్చ సాగుతోంది. ఓవైపు మార్కెట్ వ‌ర్గాల్లో - మ‌రోవైపు కామ‌న్ ఆడియెన్‌ లోనూ 2.ఓ బ‌డ్జెట్‌ పై ఒక‌టే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగడం ఉత్కంఠ రేపుతోంది. అయితే అన్ని సందేహాల‌కు తెర‌దించుతూ నేడు 2.ఓ ట్రైల‌ర్ ఈవెంట్‌ లో సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్ 2.ఓ బ‌డ్జెట్ గురించి క్లారిటీ ఇచ్చారు. `2.ఓ` సూప‌ర్‌ హిట్ ఫిలిం అని స‌ర్టిఫికెట్ ఇచ్చిన ర‌జ‌నీ బ‌డ్జెట్ మ్యాట‌ర్స్‌ ని ట‌చ్ చేశారు.

2.ఓ చిత్రాన్ని శంక‌ర్ గొప్ప విజ‌న్‌ తో రూపొందించారు. అత‌డు ఇండియ‌న్ జేమ్స్ కామెరూన్‌ - స్టీవెన్ స్పీల్ బ‌ర్గ్ అంత‌టివాడు అంటూ పొగిడేయ‌డ‌మే కాదు... 600కోట్ల బ‌డ్జెట్‌ తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించామ‌ని తెలిపారు. ఇంత పెద్ద మొత్తం ఖ‌ర్చు చేసిన నిర్మాత లైకా అధినేత సుభాష్ క‌ర‌ణ్‌ ని ర‌జ‌నీ పొగ‌డ్త‌ల్లో ముంచెత్తారు. 2.ఓ ట్రైల‌ర్ ఈవెంట్‌ కి విచ్చేసిన జాతీయ మీడియాని - ఇరుగు పొరుగు ప‌రిశ్ర‌మ‌ల మీడియాని ర‌జ‌నీ వెల్ కం చేస్తూ ప్ర‌సంగం ప్రారంభించడం కార్య‌క్ర‌మంలో హైలైట్‌. మొద‌ట ఈ సినిమాకి రూ. 300-350 కోట్లు అనుకున్నాం. ఆ త‌ర్వాత అది అలా పైపైకి పాకుతూ 500కోట్ల బ‌డ్జెట్‌ ని మించింది.. 550కోట్లు అయ్యింది.. చివ‌రికి 600కోట్ల‌కు చేరుకుంది.. అని ర‌జ‌నీ ఈ ఈవెంట్ లైవ్‌ లో బ‌డ్జెట్ మ్యాట‌ర్‌ ని రివీల్ చేశారు. మ‌రి ర‌జ‌నీ చెబుతున్న‌ట్టు 600కోట్లు ఖ‌ర్చు అయ్యిందంటే శంక‌ర్ ఏ స్థాయి విజ‌న్‌ తో ఈ సినిమాని రూపొందించారో అర్థం చేసుకోవచ్చు. ఇదే ఈవెంట్ లైవ్‌ లో ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి.. 2.ఓ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ని ప్ర‌శ్నిస్తూ రూ.500కోట్ల బ‌డ్జెట్ అంటూ ప్ర‌స్థావించారు. అయితే అంత‌కుమించి అని ర‌జ‌నీ చెప్పడం ఆస‌క్తి రేకెత్తిస్తోంది.