Begin typing your search above and press return to search.
రజనీ.. 2.0.. అదరగొట్టాడుగా..
By: Tupaki Desk | 26 Aug 2017 4:35 AM GMTఈ ఏడాది ఎంటైర్ సౌత్ ఇండియా ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని ఇంట్రస్టింగ్ గా వెయిట్ చేస్తున్న ఫిలిం 2.0. సూపర్ స్టార్ రజనీకాంత్ - దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రోబో సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పై బజ్ మామూలుగా లేదు. దీనికితోడు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తొలిసారి సౌత్ మూవీలో నటిస్తుండటం... అదీ నెగిటివ్ రోల్ చేస్తుండటం ఈ మూవీకి మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నిర్మాణం కోసం ప్రొడ్యూసర్స్ రూ. 400 కోట్లదాకా ఖర్చు పెడుతున్నారు. ఇండియన్ మూవీ హిస్టరీ లో ఇది అత్యంత భారీ బడ్జెట్. బాహుబలి-2 మూవీ బడ్జెట్ కన్నా ఇది చాలా ఎక్కువ కావడం విశేషం.
2.0 సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంతో సాగుతోంది. మూవీ మేకింగ్ కు సంబంధించిన వీడియో ను ఫిలిం మేకర్స్ రివీల్ చేశారు. ఇవి చూసిన వారికి ఇందులో ఆర్టిస్టుల కష్టం... మూవీకి ఏ రేంజిలో ఖర్చు పెడుతున్నారనే విషయం ఇట్టే అర్ధమవుతాయి. ఆర్టిఫిషియల్ ఇంటలెజిన్స్ మానవ మేథస్సును సవాల్ చేస్తే ఎలా ఉంటుందనే ఊహను ఇప్పటికే రోబో సినిమాలో చూపించేశారు. 2.0 సినిమాకొచ్చేసరికి మనిషికన్నా యంత్రాల శక్తి సామర్థ్యాలు.. తెలివితేటలు మరింత పెరిగి మనిషికి మరింత సవాల్ విసరనున్నాయి. వాటన్నింటిని మనిషి తన మేథస్సుతో ఎలా ఎదుర్కొంటాడనే విషయాన్ని విజువల్ వండర్ గా తెరకెకిస్తున్నారు.
దీనికితోడు ఈ సినిమాలో గ్రాఫిక్ వర్క్ మరింత భారీగా ఉందనే విషయం మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. గ్రీన్ మేట్ లో తీసిన మేకింగ్ స్టిల్స్ చూశాక అవి ఊహకందని స్థాయిలో ఉంటాయనే విషయం తెలిసిపోతోంది. మేకప్ కోసం అంతర్జాతీయ స్థాయి నిపుణులు ఏ స్థాయిలో పనిచేసిందీ చెప్పకనే చెప్పారు. వీటన్నింటికన్నా సూపర్ స్టార్ లుక్ అదిరిపోయిందనే చెప్పాలి. ఆ ఒక్కటి చాలదా.. అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆరాటంగా ఎదురుచూడటానికి.