Begin typing your search above and press return to search.
రోబో-2 టైటిల్ లోగో అది కాదు.. ఇది
By: Tupaki Desk | 16 Nov 2016 2:27 PM GMTరోబో సీక్వెల్ ‘2.0’ టైటిల్ లోగో అంటూ కొన్ని రోజుల కిందట ఒక ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. క్వాలిటీ ఓ రేంజిలో ఉండటంతో అది అఫీషియల్ లోగో అనే నమ్మారు జనాలు. కానీ అది అఫీషియల్ లోగో కాదని శంకర్ అండ్ టీ క్లారిటీ ఇచ్చింది. అది అఫీషియల్ లోగోనే అని.. లీక్ కావడంతో దాన్ని పక్కనబెట్టేసి ఇంకోటి రెడీ చేస్తున్నారని కూడా వార్తలొచ్చాయి. అందులో వాస్తవమెంతో కానీ.. ఇప్పుడైతే శంకర్ ‘2.0’ లోగోను అధికారికంగా లాంచ్ చేశాడు. ఈ నెల 20న ‘2.0’ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేయనున్న నేపథ్యంలో టైటిల్ లోగోను ముందుగానే ట్విట్టర్లో షేర్ చేశాడు శంకర్.
‘2.0’ మీద ఉన్న అంచనాలకు తగ్గట్లే ఉంది ఈ టైటిల్ లోగో. వందలాది రోబోల్ని గుదిగుచ్చి ఈ లోగోను రూపొందించారు. క్లోజప్ లో చూస్తే లోగోలో రోబోలున్న సంగతి అర్థమవుతుంది. శంకర్ టెక్నికల్ బ్రిలియన్స్ ఈ లోగోలోనే తెలిసిపోతోంది. కింద మనిషి ఆకారం నీడ లాగా కనిపిస్తోంది. బహుశా ఆ రూపమే ఫస్ట్ లుక్ లాగా లాంచ్ అవుతుందేమో. 20వ తారీఖున ముంబయిలోని ప్రముఖ యశ్ రాజ్ స్టూడియోలో ‘2.0’ ఫస్ట్ లుక్ లాంచ్ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేయబోతున్నారు. కరణ్ జోహార్ ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చే్స్తుండటం విశేషం. ‘2.0’ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానెల్లో ఈ కార్యక్రమాన్ని లైవ్ చూడొచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/