Begin typing your search above and press return to search.

'శివాజీ' కి 15 ఏళ్ళు.. స్పెషల్ డే నాడు రజినీతో శంకర్..!

By:  Tupaki Desk   |   15 Jun 2022 1:15 PM GMT
శివాజీ కి 15 ఏళ్ళు.. స్పెషల్ డే నాడు రజినీతో శంకర్..!
X
సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు షోమ్యాన్ శంకర్ షణ్ముగం కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి చిత్రం ''శివాజీ: ది బాస్''. ఏవీఎం ప్రొడక్షన్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది.

ఈ బ్లాక్ బస్టర్ సినిమా వచ్చి 2007 జూన్ 15న విడుదలైంది. అంటే నేటికి 15 ఏళ్ళు పూర్తి అయింది. ఈ నేపథ్యంలో అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

'శివాజీ' సినిమా విడుదలైన పదిహేను సంవత్సరాలు పూర్తైన సందర్భంగా.. ఈ స్పెషల్ డే ని మరింత ప్రత్యేకంగా మార్చడానికి దర్శకుడు శంకర్ బుధవారం తన కుమార్తెతో పాటుగా రజినీకాంత్ ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. దర్శక హీరోలిద్దరూ కాసేపు ముచ్చటించారు. ఈ విషయాన్ని శంకర్ ట్విట్టర్ వేదికగా వెల్లడిస్తూ.. సూపర్ స్టార్ తో ఉన్న ఫోటోను పంచుకున్నారు.

''శివాజీ చిత్రానికి 15 సంవత్సరాలు పూర్తయిన ఈ మరపురాని రోజున 'శివాజీ ది బాస్' రజనీకాంత్ సార్‌ ని స్వయంగా కలిసినందుకు సంతోషిస్తున్నాను. మీ ఎనర్జీ, ఆప్యాయత మరియు పాజిటివ్ ఆరా ఈరోజును గుర్తుండి పోయేలా చేసాయి'' అని శంకర్ ట్వీట్ లో పేర్కొన్నారు.

రజినీ - శంకర్ కలిసి ఉన్న ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట హల్‌ చల్ చేస్తోంది. చాలా కాలం తర్వాత అగ్ర దర్శక హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూసిన అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇద్దరూ కలిసి మరో బ్లాక్‌ బస్టర్ సినిమా చేయాలని.. కుదిరితే 'శివాజీ: ది బాస్' చిత్రానికి సీక్వెల్ తీయాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.

'శివాజీ' సినిమా తర్వాత రజినీ కాంత్ - శంకర్ కలయికలో ‘రోబో’ మరియు ‘2.O’ సినిమాలు రూపొందిన సంగతి తెలిసిందే. ఇందులో ‘రోబో’ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయగా.. భారీ అంచనాలతో వచ్చిన ‘2.O’ మాత్రం యావరేజ్‌ ఫలితాన్ని అందుకుంది. ఈ క్రేజీ కాంబోలో మరో వస్తే చూడాలని అందరూ ఆశ పడుతున్నారు. మరి ఈ కాంబో రిపీట్ అవుతుందో లేదో వేచి చూడాలి.

ఇక 'శివాజీ' విషయానికొస్తే.. ఇందులో రజినీ కాంత్ సరసన శ్రియ హీరోయిన్ గా నటించింది. ప్రతినాయకుడు ఆదిశేషుగా సుమన్ అలరించారు. ఏ.ఆర్.రెహమాన్ ఈ సినిమాకు అద్భుతమైన సంగీతం సమకూర్చారు. తెలుగులోనూ ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అప్పటికి డబ్బింగ్ సినిమాల్లో హైయ్యస్ట్ వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.