Begin typing your search above and press return to search.
రజినీ ఆ సినిమాను తిరస్కరిద్దామనుకుంటే..
By: Tupaki Desk | 26 Dec 2017 10:17 AM GMTఈ ఉదయం మొదలైన సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్ మీట్ లో అందరి దృష్టినీ ఆకర్షించింది తన రాజకీయ అరంగేట్రంపై సూపర్ స్టార్ చేసిన ప్రకటనే. ఎప్పట్లాగే రజినీ ఆ విషయంలో స్పష్టత ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. ఆ సంగతలా వదిలేస్తే.. తన సినీ కెరీర్ కు సంబంధించి రజినీ ఈ సమావేశంలో కొన్ని ఆసక్తికర సంగతులు చెప్పారు. తాను ఏ పరిస్థితుల్లో హీరోగా మారింది కూడా రజినీ ఇందులో వివరించారు.
తాను బాలచందర్ చలవతో నటుడిగా అవకాశం దక్కించుకున్నానని.. ఆయన తనను విలన్ గా పరిచయం చేయడంతో తర్వాత ఆ తరహా పాత్రలతోనే బిజీ అయ్యానని రజినీ వివరించారు. ఐతే విలన్ గా ఫుల్ బిజీగా ఉన్న సమయంలో కాలజ్ఞానం అనే నిర్మాత తనను కలిసి హీరోగా సినిమా చేస్తానని వచ్చాడని రజినీ చెప్పాడు. ఐతే తనకు ఆ సినిమా చేయడం ఇష్టం లేక నో చెప్పానని.. అయినా ఆయన తనను వదల్లేదని అన్నాడు.
ఇలా లాభం లేదని చెప్పి తాను ఏకంగా రూ.50 వేలు పారితోషకంగా డిమాండ్ చేసినట్లు రజినీ వెల్లడించాడు. నిజానికి అప్పటికి తన పారితోషకం రూ.25 వేలు-రూ.30 వేల మధ్య ఉండేదని.. ఇంత పారితోషకం చెప్పాక ఆ నిర్మాత తన వైపు కన్నెత్తి కూడా చూడడని అనుకున్నానని.. ఐతే కొన్ని రోజుల తర్వాత రూ.30 వేలు తెచ్చి అడ్వాన్సుగా తన చేతుల్లో పెట్టాడని.. అప్పట్లో శ్రీకాంత్ అనే నటుడు హీరోగా మంచి ఊపు మీద ఉండేవాడని.. ఆ నటుడే అందులో విలన్ అన్నాడని.. శ్రీదివ్య హీరోయిన్ అని చెప్పారని.. ఇక వేరే ఆలోచన లేకుండా ఆ సినిమా ఒప్పుకున్నానని రజినీ చెప్పాడు. తాను హీరోగా నటించిన తొలి సినిమా హిట్టవడంతో ఆ తర్వాత తాను హీరోగా బిజీ అయ్యానని సూపర్ స్టార్ అన్నాడు.