Begin typing your search above and press return to search.
తమ్ముడే నా గురువంటున్న రజినీకాంత్
By: Tupaki Desk | 5 Feb 2017 10:40 AM GMTసౌత్ ఇండియాలో బిగ్గెస్ స్టార్ అయిన రజినీకాంత్.. ఎప్పుడూ ఆ స్టార్ స్టేటస్ ను ఆస్వాదిస్తున్నట్లు కనిపించడు. ఆయన లైఫ్ స్టైల్ చాలా సింపుల్ గా ఉంటుంది. చాలా సామాన్యమైన జీవితాన్ని గడపడానికే ఇష్టపడతాడు రజినీ. ఏటా ఒక్కసారైనా ఆయన హిమాలయాలకు వెళ్లి వస్తాడు. అక్కడ అందరిలో ఒకడిగా ప్రయాణం సాగిస్తాడు. తాను ఎంత డబ్బు సంపాదించినా.. ఇంకెంత పేరు తెచ్చుకున్నా తనకు ఆధ్యాత్మిక ప్రయాణం ఇచ్చే ఆనందమే వేరు అంటున్నాడు రజినీ. తానెందుకు హిమాలయాలకు వెళ్తానో.. అక్కడేం చేస్తానో ఆక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రజినీ వివరించాడు.
‘‘ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్లాలని ఎప్పుడో కోరుకున్నాను. డబ్బు.. ఇతర విషయాల కంటే ఆధ్యాత్మికత ఎక్కువ సంతృప్తినిస్తుంది. నాకు శక్తినిచ్చేది అదే. ఈ విషయంలో నాకు తొలి గురువు నా తమ్ముడు సత్యనారాయణే. అతనే నన్నీ వైపు నడిపించాడు. ఇక ఆధ్యాత్మికంగా నన్ను ప్రభావితం చేసిన గురువు సచ్చిదానంద. ఆయన చనిపోయాక నేను చాలామంది గురువుల్ని అనుసరించాను. రాఘవేంద్రస్వామి నుంచి చాలా నేర్చుకున్నా. రమణ మహర్షి ద్వారా నేనేంటో తెలసుకునే ప్రయత్నం చేశా. పరమహంస యోగానంద ఆత్మకథ నాపై చాలా ప్రభావం చూపింది. ఆధ్యాత్మికత విషయంలో నా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. హిమాలయాల్లో చాలా గొప్ప రహస్యాలు ఉన్నాయి. వాటి కోసమే నేను అక్కడికి వెళ్తుంటా. ఆ ప్రయాణంలో నాకు కలిగే ఆనందమే వేరు’’ అని రజినీ వివరించాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/