Begin typing your search above and press return to search.
ప్రమోషన్ వృదా ఖర్చు - చెప్పినా విన్లేదు : రజినీ
By: Tupaki Desk | 26 Nov 2018 4:51 PM GMTఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటి ఏ సినిమాకు చేయనంత ఖర్చు చేసి దర్శకుడు శంకర్ ‘2.ఓ’ చిత్రాన్ని తెరకెక్కించాడు. దాదాపు 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. తెలుగులో ఈ చిత్రంను దిల్ రాజు మరియు ఎన్వీ ప్రసాద్ లు సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషన్స్ కోసం నేడు హైదరాబాద్ కు రజినీకాంత్ - శంకర్ - అక్షయ్ కుమార్ లు వచ్చారు. వీరు మీడియాతో ఇంట్రాక్ట్ అయ్యి సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
ఈ సందర్బంగా రజినీకాంత్ మాట్లాడుతూ.. మూడు సంవత్సరాల క్రితం ఈ సినిమా కథతో శంకర్ నా వద్దకు వచ్చినప్పుడే ఇది 3డికి చాలా బాగుంటుందనిపించింది. హై టెక్నాలజీని వాడేందుకు స్కోప్ ఉందని అర్థం అయ్యింది. శంకర్ ఒక మెజీషియన్ - తాను అనుకున్నదాన్ని మాయ చేసి చూపించగలడు. బాహుబలి సినిమా హిట్ అవ్వడానికి కారణం - ఆ సినిమాలోని సబ్జెక్ట్. అలాగే మా చిత్రంలో కూడా అద్బుతమైన సబ్జెక్ట్ ఉంది. శంకర్ ఈ చిత్రం కోసం ఏది అడిగితే అది నిర్మాత సమకూర్చాడు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ను చేసినందుకు నిర్మాతకు హ్యాట్సాఫ్. ఇక ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు ప్రత్యేకంగా నిర్వహించడం అనేది వృదా ఖర్చు అని నా అభిప్రాయం. ఇప్పటికే నేను చెన్నైలో సినిమా ప్రమోషన్ కోసం ఖర్చు చేయడం వృదా - ప్రేక్షకులు సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులే సినిమాను ప్రమోట్ చేస్తారు అన్నాను. అయినా కూడా ఎన్వీ ప్రసాద్ నా మాట వినకుండా ఇంత ఖర్చు చేసి సినిమా ప్రమోషన్ చేస్తున్నాడని రజినీకాంత్ నవ్వుతూ కామెంట్ చేశాడు. ఈ చిత్రం కేవలం సౌత్ సినీ పరిశ్రమలే కాకుండా ఇండియన్ సినీ పరిశ్రమ గర్వపడేలా ఉంటుందని రజినీకాంత్ నమ్మకం వ్యక్తం చేశాడు.
శంకర్ నా ప్రిన్సిపల్ : అక్షయ్ కుమార్
ఈ సందర్బంగా అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. నేను సినిమా పరిశ్రమకు వచ్చి 28 సంవత్సరాలు అయ్యింది. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు నేర్చుకోని పాఠాలు ఎన్నో ఈ చిత్రం షూటింగ్ సమయంలో నేర్చుకున్నాను. నాకు ఇది కేవలం సినిమా మాత్రమే కాదు - ఇది నాకు ఒక పాఠశాల. నా ఈ పాఠశాలకు ప్రిన్సిపల్ శంకర్. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు శంకర్ గారికి కృతజ్ఞతలు. రజినీకాంత్ వంటి సూపర్ స్టార్ తో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన్ను చూస్తేనే ప్రేక్షకులు మ్యాజిక్ చేసినట్లుగా మారిపోతారు. అలాంటి స్టార్ హీరో చేతిలో దెబ్బలు తినడం ను కూడా ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ఈ చిత్రం కోసం నేను మీ అందరిలాగే ఒక ప్రేక్షకుడిగా ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నాను అన్నాడు.