Begin typing your search above and press return to search.
వయసుతో పాటూ అదికూడా పెరిగిపోతుందా?
By: Tupaki Desk | 6 Nov 2015 4:47 AM GMTఎవరికైనా వయసు మీద పడేకొద్ది జవసత్వాలు కొద్దికొద్దిగా తరిగిపోవడం సహజం. మునుపు వున్నంత యాక్టీవ్ గా లేకపోవడం, చలాకీగా వ్యవహరించకపోవడం, చురుగ్గా పనులు చేయలేకపోవడం మనకు వయసు మీద పడుతున్నాయనడానికి సంకేతాలు. ఇక ఇండస్ట్రీ వ్యవహారానికి వస్తే మీద పడ్డ వయసుని మేక్ అప్ తో కవర్ చెయ్యలేకపోవడం వంటి సూచనలు కనిపిస్తాయి. కానీ ఒక నటుడికి మాత్రం వయసుతో పాటూ తేజస్సు ముఖ్యంగా స్టైల్ రోజురోజుకీ పెరిగిపోతున్నట్టు కనిపిస్తుంది. ఆయన పేరు రజినీకాంత్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
లింగా సినిమాలో కృత్రిమమైన మేక్ అప్ తో, రియాలిటీకి దూరంగా వుండే నటనతో విమర్శలు ఎదుర్కున్న రజినీ ఇప్పుడు తన తాజా చిత్రం కబలి మూవీ వర్కింగ్ స్టిల్స్ తోనే ప్రశంసలు పొందుతున్నారు. ఈ సినిమాలో మాఫియా డాన్ గా కనువిందు చేయనున్న సంగతి తెలిసినదే. ఈ నేపధ్యంలో నెరిసిన జుట్టూ గెడ్డంతో, సూటు బూటు వేసుకుని ఇస్తున్న స్టిల్స్ ఆయన వయసుని, ఆయన గత ఫ్లాపులను మర్చిపోయేలా చేస్తున్నాయి. మరి కబలితో హిట్ కొట్టి తనలోని వాడి వేడి ఏ మాత్రం తగ్గలేదని నిరువుపించుకోవడమే తరువాయి..