Begin typing your search above and press return to search.

మెర్స‌ల్ పై త‌లైవా వైర‌ల్ ట్వీట్‌?

By:  Tupaki Desk   |   23 Oct 2017 7:57 AM GMT
మెర్స‌ల్ పై త‌లైవా వైర‌ల్ ట్వీట్‌?
X
త‌మిళ స్టార్ హీరో విజయ్ న‌టించిన‌ 'మెర్సల్ ' సినిమాలో జీఎస్టీ పై - డిజిట‌ల్ ఇండియాపై డైలాగులు అభ్యంత‌ర‌క‌రంగా ఉన్నాయంటూ వివాదం చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే. ఆ డైలాగుల‌ను వెంట‌నే తొల‌గించాలంటూ త‌మిళ‌నాడు బీజేపీ నేతలు.... చిత్ర నిర్మాత‌ల‌కు సూచించారు. భార‌త్ లో 28 శాతం జీఎస్టీ ఉన్న‌ప్ప‌టికీ ఇక్క‌డ ఉచిత వైద్య స‌దుపాయాలు లేవ‌ని..... వైద్యులు - కార్పొరేట్ హాస్పిటళ్ల తీరుపై విజ‌య్ పేల్చిన‌ సెటైర్లపై డాక్ట‌ర్లు కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మెర్స‌ల్ కు విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ - హీరో విజ‌య్ తండ్రి - సినీ నిర్మాత చంద్ర‌శేఖ‌ర్‌ - ర‌చ‌యిత వి.విజ‌యేంద్ర ప్ర‌సాద్ లు బాస‌ట‌గా నిలిచారు. తాజాగా ఆ వివాదంపై త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ స్పందించారు. ఆ సినిమాకు మ‌ద్ద‌తు తెలుపుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ర‌జనీ చేసిన ట్వీట్ మీడియా - సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. త‌మిళ‌నాట ర‌జ‌నీకాంత్ ట్వీట్ గురించి ర‌క‌ర‌కాల‌ చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

త్వ‌ర‌లో త‌లైవా రాజ‌కీయ అరంగేట్రం చేయ‌బోతున్నార‌ని కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ర‌జ‌నీ....బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నార‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీకి మ‌ద్ద‌తు తెలుపుతార‌ని పుకార్లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ర‌జ‌నీకాంత్ మెర్స‌ల్ కు మ‌ద్ద‌తుగా ఆసక్తిక‌ర ట్వీట్ ఒక‌టి చేశారు. చాలా ముఖ్య‌మైన అంశాన్ని లేవ‌నెత్తారు....చాలా బాగా చేశారు....మెర్స‌ల్ టీమ్ అంద‌రికీ అభినంద‌న‌లు...'' అని ర‌జ‌నీ ట్వీట్ చేశారు. అయితే, ర‌జ‌నీ ఏ అంశాన్ని ఉద్దేశించి ట్వీట్ చేశారు? అన్న విష‌యంపై త‌మిళ నాట చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ర‌జ‌నీ....మెర్స‌ల్ సినిమాలోని అంశాల గురించి ట్వీట్ చేశారా? లేకుంటే ఆ సినిమాపై చెల‌రేగిన వివాదాల‌పై స్పందించారా? అని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. ప్ర‌స్తుతం మెర్స‌ల్ వివాదం త‌మిళ‌నాడుతో పాటు దేశ‌వ్యాప్తంగా వైర‌ల్ కావ‌డంతో ర‌జ‌నీ న‌ర్మ‌గ‌ర్భంగా ఆ ట్వీట్ చేశార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ అయిన ఈ వివాదం పై స్పందించ‌క‌పోతే ప్ర‌జ‌ల‌కు త‌ప్పుడు సందేశం వెళ్లే అవ‌కాశముండ‌డంతోనే ర‌జ‌నీ ఈ రకంగా న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశార‌ని చెబుతున్నారు. మెర్స‌ల్ లో బీజేపీ ప్ర‌వేశ‌పెట్టిన జీఎస్టీ - డిజిట‌ల్ ఇండియా విధానాల‌పై సెటైర్లు వేశార‌ని బీజేపీ నేత‌లు మండిప‌డుతున్న నేప‌థ్యంలో ర‌జ‌నీ వ్యాఖ్య‌లు ప్రాధాన్యాన్ని సంత‌రించుకున్నాయి. ఆ ట్వీట్ ను బ‌ట్టి ర‌జ‌నీ భ‌విష్య‌త్తులో బీజేపీతో జ‌త క‌ట్ట‌క‌పోవ‌చ్చ‌ని ప‌లువురు విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ర‌జ‌నీ రాబోయే ఎన్నిక‌ల్లో ఒంట‌రిపోరాటం చేసే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్య‌లు చేసి ఉంటార‌ని అనుకుంటున్నారు. మ‌రి, ర‌జ‌నీ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ నేత‌లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.