Begin typing your search above and press return to search.
అసలిది రజని సినిమానేనా?
By: Tupaki Desk | 5 Jan 2019 1:30 AM GMTఒకప్పుడు బాషా టైంలో సూపర్ స్టార్ రజనికాంత్ సినిమా వస్తోంది అంటే దాంతో క్లాష్ కాకుండా మన స్టార్ హీరోలు జాగ్రత్త పడేవాళ్ళు. అరుణాచలం-నరసింహ-రోబో లాంటి మూవీస్ తమిళ్ కంటే తెలుగులో భీభత్సంగా ఆడటంతో హైదరాబాద్ లాంటి నగరాల్లో ఏకంగా రిజిస్టర్డ్ ఫ్యాన్స్ అసోసియేషన్లు కూడా మొదలైపోయాయి. అవి ఇప్పటికీ ఉన్నాయి కాని బాక్స్ ఆఫీస్ దగ్గర రజని ఇమేజ్ మాత్రం ఇప్పుడు బాగా డ్యామేజ్ అయ్యుంది. తన నుంచి ఏదైనా కమర్షియల్ సినిమా వస్తోంది అంటే టాక్ విన్నాక చూద్దాం అనే ధోరణి బాగా పెరిగిపోయింది.
2.0లో విజువల్ ఎఫెక్ట్స్ లేకపోతే దాని పరిస్థితీ కష్టంగానే ఉండేది. అదలా ఉంచితే ఇప్పటికే వేడెక్కి ఉన్న సంక్రాంతి పోరులో తగుదునమ్మా అంటూ మధ్య వచ్చాడు పేట. విడుదల 10నే ఫిక్స్ చేసి టీవీలో ట్రైలర్లు వరసబెట్టి వదులుతున్నారు. ఇది తప్ప పేట తెలుగు టీం నుంచి ఇంతకు మించి సందడి కనిపిస్తే ఒట్టు. తమిళ ట్రైలర్ నే హడావిడిగా డబ్బింగ్ చేయించి వదిలినట్టు ఉన్నారు కాని ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు కనిపించలేదు. మూడు క్రేజీ తెలుగు స్ట్రెయిట్ మూవీస్ ఉన్నాయని తెలిసి కూడా ఇంత నిర్లిప్తంగా ఉండటం ఏమిటో అర్థం కావడం లేదు. పైగా నిర్మాత వల్లభనేని అశోక్ అంతగా సుపరిచితుడు కాకపోవడంతో మీడియాతో ఎక్కువ కనెక్ట్ కావడం లేదు.
ఇది ఫైనల్ గా ఓపెనింగ్స్ తో పాటు రన్ మీద ప్రభావం చూపడం ఖాయం. వినయ విధేయ రామ-ఎన్టీఆర్-ఎఫ్2ల మధ్య థియేటర్లు దొరకడమే గగనంగా ఉన్న పేట వరస ఇలాగే కొనసాగితే కబాలి కాలాల కన్నా తక్కువ స్థాయిలో వసూళ్లు తెచ్చుకోవడం ఖాయం. ఇప్పటికైనా మేల్కొనక పోతే 10వ తేది తర్వాత అవునా రజని కొత్త సినిమా తెలుగులో వచ్చిందా అంటూ మన ప్రేక్షకులు ఆశ్చర్యార్థకం మొహం పెట్టి అడిగినా ఆశ్చర్యం లేదు.