Begin typing your search above and press return to search.
మరోసారి పేట దర్శకుడితో సూపర్ స్టార్!
By: Tupaki Desk | 8 Feb 2021 5:30 PM GMTసూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ఏ కొత్త వార్త వినిపించినా దేశవ్యాప్తంగా అభిమానులలో ఊపు కనిపిస్తుంది. ఆయన స్టైల్ తోనే సూపర్ స్టార్ అనే బిరుదు సొంతం చేసుకున్నాడు. రజినీకాంత్ నడకలో.. మాటలో ప్రతి యాక్షన్ లో యూనిక్ స్టైల్ కనిపిస్తుంది. నాటి హీరోల నుండి నేటి యంగ్ హీరోలకు సైతం సూపర్ స్టార్ పోటీగా నిలుస్తున్నాడు. ఏడుపదుల వయసులోను నేటికీ హీరోగా థియేటర్లలో రికార్డులు సృష్టిస్తుంది కేవలం రజిని ఒక్కడే. చివరిగా 'దర్బార్' సినిమా విజయంతో ఊపులో ఉన్న రజిని ప్రస్తుతం 'శంఖం' ఫేమ్ శివ దర్శకత్వంలో తన 168వ సినిమాను పూర్తిచేస్తున్నాడు. రజినీ - శివ కాంబినేషన్ మూవీకి అన్నాతే అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా గురించి రజినీకాంత్ అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.
2021 దీవాలి సందర్బంగా ఈ భారీ బడ్జెట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నవంబర్ 4న విడుదల కానుంది. ఇంతలో రజినీకాంత్ మరో న్యూ సినిమా గురించి కొన్ని వార్తలు తమిళ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. అన్నాతే సినిమా తర్వాత సూపర్ స్టార్ తదుపరి సినిమా యువదర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో చేయనున్నట్లు సమాచారం. ఇదివరకు రజినితో 2019లో పేట అనే సినిమా రూపొందించాడు కార్తీక్. భారీ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. వీరిద్దరి కాంబినేషన్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్తుందని టాక్ నడుస్తుంది. అలాగే ఆ సినిమా 2022 దీపావళికి విడుదల అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. అధికారిక ప్రకటన రాలేదు కానీ వార్తలైతే స్ప్రెడ్ అవుతున్నాయి. చూడాలి మరి పేట కాంబినేషన్ మళ్లీ సెట్ అవుతుందేమో!