Begin typing your search above and press return to search.
కింగ్ ఖాన్ నుంచి లాగేసుకుంటున్న రజినీ
By: Tupaki Desk | 31 March 2017 6:37 AM GMTబాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ అనేక బ్రాండ్లకు అండార్స్ చేస్తాడనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి ఓ అండార్స్ మెంట్ సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ కి వచ్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేంటీ రజినీ యాడ్స్ లో నటిస్తారా అనుకోకండి. ఇది మలేషియా టూరిజంకు బ్రాండ్ అంబాసిడర్ కహానీ.
2008 నుంచి మలేషియా టూరిజంకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు షారూక్ ఖాన్. ఓ దశాబ్దం క్రితం అక్కడి ప్రభుత్వం షారూక్ కి 'డాటో' అవార్డ్ కూడా ఇచ్చింది. మన దేశంలో పద్మ అవార్డుతో సమానమైన విలువ దీనికి ఉంటుంది. ఇప్పుడు ఇదే అవార్డ్ ను రజినీకి ఇచ్చి.. మలేషియా టూరిజం ప్రచార బాధ్యతలు కూడా అప్పగించాలని భావిస్తోంది మలేషియా ప్రభుత్వం. ఇప్పటికే అక్కడి టూరిజం మంత్రి దటుక్ సేరి మొహమ్మద్ నజ్రి అబ్జుల్ అజీజ్ ఈ మేరకు పార్లమెంట్ లో ప్రతిపాదించగా.. దీనికి మలేషియా పార్లమెంట్ సభ్యుల నుంచి మద్దతు కూడా లభించింది.
మలేషియాలో రజినీకి ఫుల్ ఫాలోయింగ్ ఉంటుంది. సూపర్ స్టార్ రీసెంట్ మూవీ కబాలిని.. అక్కడే మెజారిటీ భాగం తీయగా.. చెన్నై-హాంకాంగ్ లలో కొంత భాగమే చిత్రీకరించారు. అక్కడి జనాలు కూడా రజినీ కనబడితే చాలు.. భారీ ఎత్తున గుమిగూడిపోతూ ఉంటారు. అందుకే కబాలిని మలాయ్ భాషలో కూడా విడుదల చేశారు. అంత క్రేజ్ ఉండడంతోనే ఇప్పుడు మలేషియా టూరిజం ప్రచార బాధ్యతలు అప్పగించాలని.. అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/