Begin typing your search above and press return to search.

2018లో రజినీ నామ జపమే!!

By:  Tupaki Desk   |   14 Sept 2017 9:00 PM IST
2018లో రజినీ నామ జపమే!!
X
రజినీకాంత్ సినిమా వస్తోందంటే.. దేశం మొత్తం ఏ స్థాయిలో ఊగిపోతుందో.. జన జీవనం ఏ స్థాయిలో స్తంభించిపోతుందో రీసెంట్ గా కబాలి మూవీతో చూశాం. కంపెనీలు కంపెనీలే సెలవలు ఇచ్చేశాయి. వారం ముందు నుంచి రజినీ ఫీవర్ దేశమంతా పాకిపోయింది. సాత్ఇండియాలో ఈ ట్రెండ్ మరీ ఎక్కువ కాగా.. పక్క దేశాల్లో కొన్ని చోట్ల ఇలాంటి ట్రెండ్ కనిపించింది.

రజినీ సినిమా వస్తోందంటే ఇలాంటి సీన్ మళ్లీ రిపీట్ అవడం ఖాయమే అని చెప్పచ్చు. ఏడాదికి రెండేళ్లకు ఒక సినిమా చేసే సూపర్ స్టార్ ఒక సినిమాకే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఒకే ఏడాది రెండు సినిమాలు వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? వచ్చే ఏడాది అంటే 2018లో ఇదే జరగబోతోంది. వాస్తవానికి ఈ ఏడాది సమ్మర్ కే రిలీజ్ కావాల్సిన రోబో సీక్వెల్ 2.0.. అటు తిరిగి ఇటు తిరిగి వచ్చే ఏడాది జనవరి 25 వరకూ వెళ్లింది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తయిపోగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో సౌతిండియా సూపర్ స్టార్ మరో సినిమా మొదలుపెట్టేయడమే కాదు.. షూటింగ్ పూర్తి చేసేస్తున్నారు కూడా.

ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయిన మూవీ కాలా కరికులన్. మరో నెల్లాళ్లు షూటింగ్ చేస్తే ఇది కూడా పూర్తయిపోనుండగా.. దీన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి విడుదల చేయనున్నారు. అంటే జనవరిలో ఓ సినిమా.. ఏప్రిల్ లో మరో సినిమా.. ఈ లెక్కన సగం ఏడాదికి పైగా రజినీ నామ జపం చేయడమే ఇక.