Begin typing your search above and press return to search.
ఇళయరాజా కొత్త స్టూడియో దేవాలయం అన్న రజనీ
By: Tupaki Desk | 17 Feb 2021 5:30 AM GMTమ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా కొత్తగా నిర్మించిన మ్యూజిక్ స్టూడియోని సూపర్ స్టార్ రజనీకాంత్ సందర్శించారు. ఒక ఆలయం లోపలికి ప్రవేశించినట్టుగా ఉందని రజనీ వ్యాఖ్యానించారు.
ప్రఖ్యాత ప్రసాద్ స్టూడియోతో వివాదాన్ని పరిష్కరించుకున్న తరువాత మాస్ట్రో ఇళయరాజా తన సొంత మ్యూజిక్ స్టూడియోను ఇటీవల నిర్మించారు. ఇటీవలే ఈ స్టూడియో ప్రారంభమైంది. కరోనావైరస్ భయం కారణంగా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఫిబ్రవరి 15 న ఇళయరాజా మ్యూజిక్ స్టూడియోని సందర్శించారు.
ఇళయరాజా స్టూడియోకి వెళ్లేముందు ఆయన నివాసాన్ని కూడా రజనీ సందర్శించారు. ఈ స్టూడియో చెన్నైలోని కోడంబాక్కంలో ఉంది. స్టూడియో సందర్శనానంతరం రజనీకాంత్ మాట్లాడుతూ ``ఒక ఆలయం లోపల ఉన్నట్లు అనిపించింది`` అని వ్యాఖ్యానించారు. స్టూడియోలో రజనీకాంత్ ఫోటోలు ప్రస్తుతం అభిమానుల్లో వైరల్ గా మారాయి.
రజనీకాంత్ `అన్నాట్టే` షూటింగ్ ఇటీవల వాయిదా పడిన సంగతి తెలిసిందే. మార్చిలో తిరిగి ప్రారంభిస్తారని తెలిసింది. ఈ చిత్రంలోని మిగిలిన షూటింగ్ అంతా ఒక నెలలో పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అన్నాథే షెడ్యూల్ కు సంబంధించి అధికారిక ధృవీకరణ త్వరలో రానుంది. రజనీకాంత్ తన పార్ట్ మొత్తం ఒకే షెడ్యూల్ లో పూర్తి చేస్తారు. తద్వారా ఈ చిత్రం నిర్మాణానంతర పనులకు తగినంత సమయం ఉంటుంది. అంతకుముందు అన్నాథే షూటింగ్ 2020 డిసెంబర్ లో తిరిగి ప్రారంభమైనా.. సిబ్బంది కోవిడ్ -19 పాజిటివ్ పరీక్షలతో షూటింగ్ ను అర్థాంతరంగా నిలిపివేయాల్సి వచ్చింది.
రజనీకాంత్ నెగెటివ్ పరీక్షించినప్పటికీ అతనికి స్వల్ప అనారోగ్యం ఇబ్బంది కలిగించింది. రక్తపోటులో తీవ్రమైన హెచ్చుతగ్గుల కారణంగా ఆయన కొన్ని రోజులు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. హైదరాబాద్ లో రజనీకాంత్ కు చికిత్స చేసిన వైద్యులు విశ్రాంతి తీసుకోమని ఒత్తిడికి గురవ్వద్దని సలహా ఇచ్చారు.