Begin typing your search above and press return to search.

రజినీ కళ్లు రీమేక్ పై పడ్డాయా?

By:  Tupaki Desk   |   18 Feb 2016 7:22 AM GMT
రజినీ కళ్లు రీమేక్ పై పడ్డాయా?
X
సూపర్ స్టార్ రజినీకాంత్ కొన్నేళ్లుగా చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు. ఏమాత్రం హడావుడి పడకుండా ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్నాడు. ‘లింగా’ తర్వాత కొత్త సినిమా ‘కబాలి’ మొదలుపెట్టడానికి ఏడెనిమిది నెలలు టైం తీసుకున్నాడు. ఐతే ఈ సినిమా పూర్తయ్యే సమయానికి శంకర్ ‘రోబో-2’తో రెడీ అయిపోవడంతో ఆయన ఇంతకుముందులాగా ఖాళీగా ఉండాల్సిన అవసరం లేకపోయింది. ఈ సినిమా పూర్తవడానికి కనీసం ఏడాదైనా పట్టేలా ఉంది. ఐతే ఈ లోపే రజినీ తర్వాతి సినిమా గురించి ఊహాగానాలు మొదలైపోయాయి. సూపర్ స్టార్ కళ్లు ఓ కన్నడ రీమేక్ మీద పడ్డాయని కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

కన్నడలో ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ‘శివలింగ’ రీమేక్ లో నటించడానికి రజినీ ఆసక్తి చూపిస్తున్నట్లు చెబుతున్నారు. శివరాజ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాను పి.వాసు రూపొందించడం విశేషం. ఇంతకుముందు ఆయనే రజినీతో ‘చంద్రముఖి’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘కథానాయకుడు’ ఫ్లాప్ అయినప్పటికీ పి.వాసు మీద రజినీకి బాగానే గురి ఉంది. ‘చంద్రముఖి’ తరహాలోనే ‘శివలింగ’ కూడా హార్రర్ నేపథ్యమున్న సినిమా. వైవిధ్యమైన కథతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రజినీ ఇమేజ్ కు తగ్గట్లు తమిళంలో తీయడం కోసం పి.వాసు ప్రయత్నిస్తున్నారట. ఇంకా ఏమీ ఫైనలైజ్ కాకపోయినప్పటికీ ప్రస్తుతానికి చర్చలు మాత్రం నడుస్తున్నాయి.