Begin typing your search above and press return to search.

అప్పుడు ఇక్కడ.. ఇప్పుడు అక్కడ..

By:  Tupaki Desk   |   31 Oct 2015 5:30 PM GMT
అప్పుడు ఇక్కడ.. ఇప్పుడు అక్కడ..
X
20 ఏళ్ల కాలం.. అదేం తక్కువ టైం కాదు. ఇంత సమయం అంటే చాలా మార్పులొస్తాయి. ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఇంత సుదీర్ఘ కాలం నిలబడ్డమంటే మామూలు విషయం కాదు. అతి తక్కువ మంది మాత్రమే.. తమ స్థాయిని రెండు దశాబ్దాల పాటు నిలబెట్టుకోగలరు. వీరిలో స్థాయిని పెంచుకున్న వారి సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఇలాంటి అరుదైన వ్యక్తే. పై ఫోటో చూడండి. రెండు దశాబ్దాల క్రితం రజినీకాంత్ క్రేజ్ ఇండియాలో ఇలా ఉండేది. అదే ఇప్పుడైతే.. అక్కడో మహాసభ జరుగుతున్నట్లుగా ఉంటుంది లెండి.

ఇరవై ఏళ్ల తర్వాత మరో దేశంలోనూ అభిమానుల మధ్య ఇలాగే కనిపిస్తున్నారు రజినీ. ఎవరైనా ఫారినర్స్ మన దేశం వస్తే వింతగా వారి వంక చూస్తాం. కాన మనవాళ్లను విదేశాల్లో ఇంతగా గుర్తించడం చాలా తక్కువగా ఉంటుంది. అది కూడా సినిమా హీరోల విషయంలో అయితే అసలు చెప్పనవసరం లేదు. బాలీవుడ్ హీరోలంటే ఆ లెక్క వేరు. కానీ రజినీకాంత్ కి ప్రపంచవ్యాప్తంగా వాళ్లకి మించిన పేరు ప్రఖ్యాతులున్నాయి. జపాన్ - మలేషియాలాంటి దేశాల్లో.. మన సూపర్ స్టార్ సినిమాలు అక్కడి లోకల్ పిక్చర్స్ రేంజ్ లో రిలీజ్ అవుతాయి. అంతగా ఆడతాయి కూడా.

రజినీకాంత్ స్టయిల్ కు వాళ్లు గులామ్ అయిపోయారు. అందుకే తమ అభిమాన హీరో కనిపంచగానే సలాంలు కొట్టడానికి వచ్చేశారు. సినీరంగం నుంచి వచ్చి భారతీయుల ఖ్యాతిని ప్రపంచవ్యాప్తికి తీసుకెళ్లిన అతి కొద్దిమందిలో రజినీకాంత్ ఒకరని చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ అవసరం లేదు.