Begin typing your search above and press return to search.
రజనీకాంత్ లెగసీని నడిపించే సిసలైన వారసులు!
By: Tupaki Desk | 16 Dec 2022 3:38 AM GMTసూపర్ స్టార్ రజనీకాంత్ కి నటవారసుడు ఎవరూ లేరు. ఆయనకు ఉన్న ఇద్దరు కుమార్తెలకు వివాహాలు చేసారు. అల్లుడు ధనుష్ మాత్రమే నటుడిగా కొనసాగుతున్నారు. అయితే ఆయన వంశ వృక్షం నుంచి పుట్టుకొచ్చిన మనవళ్లు (కుమార్తెల వారసులు) వేగంగా ఎదిగేస్తున్నారు. వీళ్లు ఇక మీదట సినీరంగంలోకి అడుగు పెట్టి తాత లెగసీని ముందుకు నడిపించాల్సి ఉంటుంది.
ఏ తాతకైనా ఇంతకుమించిన ఆనంద క్షణాలు లభించడం చాలా అరుదు. ఈ రేర్ మూవ్ మెంట్ ని కెమెరా క్యాప్చుర్ చేయగా రజనీ ఈ ఫ్రేమ లో ఎంతో ఆనందిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక రజనీ వెనక నుంచి అలా తాతగారి తలపై తన నుదిటిని ఆన్చి పెద్ద మనవడు ఎంతో అల్లరిగా కనిపిస్తున్నాడు. చిన్న మనవడు రజనీ పాదాల వద్దనే నేలపై కూచుని ఫోజిచ్చాడు. ఆ ఇద్దరు కిడ్స్ ఎంతో స్మార్ట్ గా కనిపిస్తున్నారు. రజనీ లెగసీని నడిపించే భవిష్యత్ తారలుగాను అప్పియరెన్స్ ఉంది.
ఐశ్వర్య రజనీ ఇన్ స్టా వేదికగా ఈ ఫోటోలను షేర్ చేసారు. ధనుష్- ఐశ్వర్య జంటకు జన్మించిన పుత్ర రత్నాలు ఆ ఇద్దరూ. తాతయ్యను ఆటపట్టిస్తూ సరదాగా అలా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో రజనీ కాంత్ అభిమానుల్లో వైరల్ గా మారింది.
తిరుమలలో ప్రత్యేక పూజలు..
సూపర్ స్టార్ రజనీకాంత్ ఈరోజు తిరుమలలో పూజలు చేశారు. గురువారం నాడు వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఆయనతోపాటు ఆయన కుమార్తె ఐశ్వర్య కూడా ఈ సేవలో ఉన్నారు. ఆలయం నుంచి బయటకు వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడిన రజనీకాంత్ ఆరేళ్ల విరామం తర్వాత తాను ఈ పట్టణానికి వస్తున్నానని.. పీఠాధిపతి ఆశీస్సులు పొందేందుకు వచ్చానని చెప్పారు.
డిసెంబర్ 12న సూపర్ స్టార్ రజనీకాంత్ తన 72వ పుట్టినరోజు జరుపుకోగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు స్నేహితులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నిన్న (డిసెంబర్ 14) రాత్రి రజనీకాంత్ తన పెద్ద కుమార్తె ఐశ్వర్యతో కలిసి తిరుమల బాలాజీ ఆలయానికి చేరుకోగా ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. రజనీకాంత్ - ఐశ్వర్య ఈరోజు (డిసెంబర్ 15) తెల్లవారుజామున తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందారు. రజనీకాంత్ ప్రవేశానికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రజనీ కుటుంబం రష్ ఫ్రీ దర్శనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా అమీన్ పీర్ దర్గాను సందర్శించేందుకు రజనీకాంత్ తదుపరి వెళ్లనున్నారు. అమీన్ పీర్ దర్గా సందర్శనలో రజనీకాంత్- ఐశ్వర్యతో AR రెహమాన్ కూడా చేరనున్నారు. ఇద్దరు ప్రముఖ తారల రాక కోసం జిల్లా యాజమాన్యం వారి భద్రతా ఏర్పాట్లతో సిద్ధంగా ఉంది. అమీన్ పీర్ దర్గా ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. గతంలో అనేక మంది ప్రముఖులు దర్గాను సందర్శించారు.
రజనీకాంత్ - ఐశ్వర్య- ఏఆర్ రెహమాన్ భక్తి యాత్ర వెనుక కారణం 'లాల్ సలామ్' షూటింగ్ త్వరలో ప్రారంభం కావడమే. విష్ణు విశాల్ - విక్రాంత్ ప్రధాన పాత్రలలో నటించిన 'లాల్ సలామ్'తో ఐశ్వర్య రజనీకాంత్ దర్శకురాలిగా తిరిగి రీఎంట్రీ ఇచ్చింది. కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రజనీకాంత్ అతిధి పాత్రలో కనిపించనుండగా ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. 'లాల్ సలామ్' నవంబర్ లో అధికారికంగా ప్రారంభమైంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ చివరి వారంలో లేదా జనవరి ప్రారంభంలో ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.