Begin typing your search above and press return to search.

క‌బాలి.. హాలీవుడ్ సినిమా ఎత్తేశారా?

By:  Tupaki Desk   |   6 Nov 2015 6:12 AM GMT
క‌బాలి.. హాలీవుడ్ సినిమా ఎత్తేశారా?
X
హ్యూమ‌న్ ట్రాఫికింగ్ చేసే గ్యాంగ్ కూతురిని ఎత్తుకెళితే .. త‌న‌ని ర‌క్షించుకునేందుకు ఓ తండ్రి చేసిన సాహ‌సాలేంటి? అన్న క‌థాంశంతో హాలీవుడ్ సినిమా టేకెన్ తెర‌కెక్కింది. ఈ యాక్ష‌న్ ఎడ్వంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్ హాలీవుడ్‌ లో బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్. టేకెన్ ఇన్‌ స్పిరేష‌న్‌ తో ఇప్ప‌టికే ఎన్నో సినిమాలు ప్ర‌పంచ‌వ్యాప్తంగా తెర‌కెక్కాయి. ఇప్పుడు ఆ సినిమా ఇన్‌ స్పిరేష‌న్‌ తోనే, సేమ్ టు సేమ్ అదే లైన్‌ తోనే క‌మ‌ల్‌ హాస‌న్ న‌టించిన చీక‌టిరాజ్యం తెర‌కెక్కింది. అయితే ఈ చిత్రంలో కొడుకుని కిడ్నాప‌ర్స్ నుంచి ర‌క్షించేందుకు పాటు ప‌డే తండ్రిగా క‌మ‌ల్ న‌టించారు. అయితే చీక‌టిరాజ్యంతో పాటు సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న క‌బాలి చిత్రం కూడా హాలీవుడ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ టేకెన్‌ కి కాపీ అని చెబుతున్నారు.

లియామ్ నీస‌న్ హీరోగా రూపొందిన టేకెన్ మూవీ నుంచి ఇన్‌ స్ప‌యిర్ అయ్యి సేమ్ లైన్‌, యాక్ష‌న్‌ తో సినిమాని తెర‌కెక్కిస్తున్నార‌ని సాంబార్‌ ల్యాండ్‌ టాక్‌. టేకెన్ సినిమా ఫ్రాన్స్ నేప‌థ్యంలో ఉంటుంది. క‌బాలి త‌మిళ‌నాడు, మ‌లేషియా బ్యాక్‌ డ్రాప్‌ ల‌లో తెర‌కెక్కుతోంది. డ్ర‌గ్ మాఫియా వ‌ల‌లో చిక్కుకున్న కూతురి కోసం ఓ మాజీ గ్యాంగ్ స్ట‌ర్ ఎలాంటి సాహ‌సాలు చేశాడ‌న్న‌దే సినిమా. క‌బాలీశ్వ‌రుడు తిరిగి మాఫియాలోకి అడుగుపెట్టేందుకు కార‌ణ‌మైన విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే అంటున్నారు. ఈ చిత్రంలో డ్ర‌గ్స్‌ కి అడిక్ట్ అయిన డాట‌ర్‌ గా ధ‌న్షిక న‌టిస్తోంది. రాధిక ఆప్టే క‌బాలీశ్వ‌రుని భార్య‌గా న‌టిస్తోంది. ఇప్ప‌టికే క‌బాలి ఫ‌స్ట్‌ లుక్ రిలీజైంది. ఈ ఫ‌స్ట్‌ లుక్ పోస్ట‌ర్‌ ని ఫిలిప్పినో ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన టిక్ టిక్: ది అస్వాంగ్ క్రానిక‌ల్స్ అనే చిత్రం నుంచి కాపీ కొట్టారన్న విమ‌ర్శ‌లొచ్చాయి. అదీ మ్యాట‌రు. ర‌జ‌నీ - క‌మ‌ల్ అంత‌టివారే టేకెన్‌ ని కాపీ కొడుతున్నార‌న్న‌మాట‌!