Begin typing your search above and press return to search.
షాకింగ్: కబాలి రిలీజ్ అవ్వట్లేదా??
By: Tupaki Desk | 29 Jun 2016 8:07 AM GMTఇప్పటికైతే సౌతిండియాలో మోస్ట్ అవైటింగ్ మూవీ రజినీకాంత్ కబాలి. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తుంటే.. ఏప్రిల్ నుంచి ఈ మూవీ వాయిదా పడుతూనే వస్తోంది. అప్పట్లో ఎలక్షన్స్ వంక చూపించారు కానీ.. అసలీ సినిమాకి సంబంధించిన వర్క్ ఇంకా పూర్తి కాలేదని ఈ మధ్యే అసలు విషయం చెప్పారు. ఇప్పుడు జూలై 1న సెన్సార్ చేసి.. జూలై 15న విడుదల చేస్తారనే వార్తలు ఉన్నా.. అవన్నీ జరిగేలా కనిపించట్లేదు.
జూలై 1న సెన్సార్ చేయించుకోవాలంటే ఈ పాటికే సెన్సార్ వాళ్లకి అప్లికేషన్ పెట్టాల్సి ఉంది. ఈటైంలో సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు చెప్పుకొచ్చింది కబాలి యూనిట్. ఇందుకు సినిమాకి సంబంధించిన వర్క్ ఇంకా ఫినిష్ కాలేదన్నది రీజన్. అయితే అసలు విషయం మాత్రం వేరే ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జరుగుతున్న ఆలస్యమే కబాలి రిలీజ్ లేట్ అవడానికి కారణం. అందులో రజినీకాంత్ వెర్షన్ కు డబ్బింగ్ కూడా ఒకటి. తెలుగులో అంటే రజినీ పాత్రకు సింగర్ మనో డబ్బింగ్ చెబుతాడు. తమిళ వెర్షన్ కు అలా కుదరదు కదా.
తమిళ్ కబాలికి రజినీ స్వయంగా డబ్బింగ్ చెప్పాల్సి ఉంటుంది. గత నెల రోజులుగా రజినీ అమెరికాలోనే ఉన్న విషయం తెలిసిందే. మరి రజినీకాంత్ ఇండియాకి వచ్చి.. కొంత రిలాక్స్ అయ్యాకే ఆయన డబ్బింగ్ చెప్పే ఛాన్స్ ఉంటుంది. అప్పటివరకూ ఆ విషయాన్ని బైటకు చెప్పలేదు యూనిట్. అదీ ఇదీ అని చెప్పుకుంటూ కాలక్షేపం చేయడమే.