Begin typing your search above and press return to search.

కోర్టు ధిక్కారం ఆరోప‌ణ‌ల‌పై ర‌జ‌నీ భార్య స్పంద‌న‌

By:  Tupaki Desk   |   17 Dec 2020 8:29 AM GMT
కోర్టు ధిక్కారం ఆరోప‌ణ‌ల‌పై ర‌జ‌నీ భార్య స్పంద‌న‌
X
సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ స‌తీమ‌ణి ల‌తా ర‌జ‌నీకాంత్ కోర్టు ధిక్కారానికి పాల్ప‌డ్డారా? తాను నిర్వ‌హిస్తున్న స్కూల్ విష‌యంలో హ‌ద్దుమీరి ప్ర‌వ‌ర్తించారా? అంటే ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లో ఆ త‌ర‌హా ప్ర‌చారం సాగిపోయింది. అయితే త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై ఆమె ప‌త్రిక‌ల ద్వారా అధికారికంగా స్పందించారు.

తాను ఎలాంటి కోర్టు ధిక్కారానికి పాల్ప‌డ‌లేద‌ని సూపర్ స్టార్ భార్య స్పష్టం చేశారు. లతా రజనీకాంత్ తరపున న్యాయవాది శ్రీమతి రజనీకాంత్ పై అవ‌న్నీ పుకార్లు మాత్ర‌మేన‌ని స్పష్టం చేస్తూ ఒక పత్రికా ప్ర‌క‌ట‌న విడుదల చేశారు. ఆ ప్ర‌క‌ట‌న‌లో అస‌లేం జరిగిందో స‌వివరంగా వెల్ల‌డించారు.

దాని ప్ర‌కారం.. ల‌తా ర‌జ‌నీకాంత్ కోర్టు ధిక్కారానికి పాల్ప‌డ‌లేదు. మ‌హ‌మ్మారీ కారణంగా వారి విద్యా సంస్థ ప్రాంగణాన్ని ఖాళీ చేయవద్దని హైకోర్టు అనుమతి కోరింది. విద్యార్థులు వారి విద్యా సంవత్సరం మధ్యలో ఉన్నారు. 2021 ఏప్రిల్ వరకు ఉండటానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. కానీ పాఠశాల ప్రస్తుత ప్రాంగణంలో ప్రవేశాలు తీసుకోకూడదు. తాము ఎటువంటి బకాయిలు లేకుండా ప్రాంగణానికి అద్దె చెల్లిస్తున్నామ‌ని పత్రికా నోట్ ద్వారా స్పష్టం చేసారు. తాజాగా లతా కోర్టును ధిక్కరించినట్లు సోషల్ మీడియా స‌హా విజువల్ మీడియాలో పుకార్లు వ‌చ్చాయి. దానికి వెంట‌నే లతా రజనీకాంత్ పత్రికా ప్రకటన ద్వారా ఆన్స‌ర్ చేశారు.