Begin typing your search above and press return to search.
సంజు స్క్రిప్ట్ మార్చింది నిజమే!
By: Tupaki Desk | 14 Sep 2018 10:43 AM GMTఈ ఏడాది బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో 'సంజు' ఒకటి. సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు దర్శకుడు రాజ్ కుమార్ హీరాని. సంజయ్ పాత్రలో రణబీర్ కపూర్ నటించాడు. సినిమా బ్లాక్ బస్టర్ అయింది రణబీర్ సింగ్ కు భారీ ప్రశంసలు దక్కాయి గానీ అగ్రదర్శకుడైన హీరానికి మాత్రం విమర్శలు తప్పలేదు.
సంజయ్ జీవితం లోని చీకటి కోణాలు చూపించినట్టే కలరింగ్ ఇచ్చి వాస్తవాలను దాచాడని.. అసలు సంజయ్ లైఫ్ లో తప్పేమీ లేదు అంతా విధి ప్రభావం అన్నట్టుగా షుగర్ కోటింగ్ ఇచ్చాడని చాలామంది ఘాటుగా విమర్శించారు. అసలు 1993 బాంబు బ్లాస్ట్ కేసు విషయం లో కూడా వాస్తవాలను చూపలేదని కూడా విమర్శలు ఉన్నాయి. కొంతమంది నెటిజనులయితే ఇక సల్మాన్ ఖాన్ కూడా 'సల్లు' అనే పేరుతో షుగర్ కోటింగ్ సినిమాను తీసేందుకు హీరాని ని సంప్రదించాడని - భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశాడని పంచ్ లు విసిరారు.
రీసెంట్ గా హిరాని ఇండియన్ ఫిలిం అండ్ టీవీ డైరెక్టర్స్ అసోసియేషన్ మాస్టర్ క్లాస్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. ఔత్సాహిక డైరెక్టర్లకు తన అనుభవాన్ని పంచుతూ 'సంజు' విషయంలో స్క్రిప్ట్ లో మార్పు చేర్పులు జరిగిన విషయం నిజమేనని ఒప్పుకున్నాడు. మొదట్లో అన్నీ నిజాలే చూపించాడట. ఉన్నది ఉన్నట్టే సినిమా తీశానని.. ఆ వెర్షన్ చూసిన వాళ్ళకెవరికీ నచ్చలేదని దాంతో హీరో క్యారెక్టర్ ను చూసిన ఆడియన్స్ ఎంపతీ( సానుభూతి.. ఒక రకంగా ఆర్ద్రత అని కూడా అనుకోవచ్చు) కలగదు అని భావించి కొన్ని సింపతీ కలిగేలా కొత్త సీన్స్ ను జోడించడం జరిగిందని చెప్పాడు. ఆ ప్రాసెస్ లో కొన్ని ఆల్రెడీ చిత్రీకరించిన సీన్స్ ను ఎడిటింగ్ కూడా చేయాల్సి వచ్చిందట. ఏదేమైనా హీరాని మాత్రం సంజు బాబా మనసు మంచిదని కితాబివ్వడం కొసమెరుపు.
'సంజు' షుగర్ కోటింగ్ విషయాన్నీ హీరాని ఓపెన్ గా అంగీకరించడంతో ఇప్పటివరకూ సినిమాపై వచ్చిన విమర్శలు నిజమని నమ్మక తప్పదు.